కోవిడ్ ఆంక్షల తర్వాత.. అప్పుడే మళ్లీ ప్రయాణాలు మొదలయ్యాయట. ఆ  సమయంలో ఆయన తన కుమారుడు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి తినడానికి ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. 

మన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా.. అమెరికాలో తనకు ఎదురైన ఓ సంఘటనను పంచుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆయన తన కొడుకుతో కలిసి అమెరికాలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. అమెరికా కన్నా మనమే అడ్వాన్స్డ్ గా ఉన్నామని చెప్పకనే చెప్పారు.

జైశంకర్.. 2021లో అమెరికాలో ఉన్న తన కొడుకు దగ్గరకి ఆయన వెళ్లారట. కోవిడ్ ఆంక్షల తర్వాత.. అప్పుడే మళ్లీ ప్రయాణాలు మొదలయ్యాయట. ఆ సమయంలో ఆయన తన కుమారుడు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి తినడానికి ఓ రెస్టారెంట్ కి వెళ్లారు.

Scroll to load tweet…

అయితే.. ఆ రెస్టారెంట్ సిబ్బంది.. వారిద్దరినీ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించమని అడిగారట. వెంటనే... మంత్రి జైశంకర్ తన ఫోన్ లో ఉన్న వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని చూపించారట. కానీ.. ఆయన కుమారుడు మాత్రం.. తన వ్యాలెట్ లో మడత పెట్టి ఉంచిన కాగితాన్ని తీసి చూపించాడట. ఆ తర్వాత.. జైశంకర్ తన కొడుకు చేతిలోని పేపర్ చూశాడట. ఈ విషయాన్ని ఆయన తాజాగా పంచుకోగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


ఈ చిన్న క్లిప్‌ను ట్విట్టర్ యూజర్ అరుణ్ పుదూర్ షేర్ చేశారు, "భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ యుఎస్‌లోని తన కొడుకుతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్ళారు..తరువాత ఏమి జరిగిందో తెలుసా" అనే క్యాప్షన్ తో షేర్ చేయడం గమనార్హం.

మన దేశంలో.. కోవిడ్ సర్టిఫికేషన్ ఆన్ లైన్ లో ఇవ్వగా.. అమెరికా లాంటి టాప్ దేశం.. ఇలా కాగితం రూపంలో ఇవ్వడం గమనార్హం. దీంతో.. నెటిజన్లు.. ఈ వీడియోపై వివిధ రకాలు స్పందిస్తున్నారు. ఈ వీడియోకి 3లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.

కో-విన్ ప్లాట్‌ఫారమ్ అనేది కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ల కోసం కేంద్రం ప్రారంభించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. వ్యాక్సిన్ పొందడానికి, టీకా సర్టిఫికేట్‌లను పొందడానికి స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి ప్లాట్‌ఫారమ్ ఉపయోగిస్తున్నారు.