Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిదేండ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, రాజకీయ సుస్థిరత: మంత్రి కిషన్ రెడ్డి

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, సుస్థిరత నెలకొని ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మోడీ పాలనలో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, రాజకీయ సుస్థిరత నెలకొందని, ప్రజలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Union Minister Reddy Says BJP At Centre Brought Peace, Stability To Northeast
Author
First Published Dec 19, 2022, 5:44 PM IST

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈశాన్య ప్రాంతంలో శాంతి, రాజకీయ సుస్థిరత నెలకొందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం లోక్ సభ సమావేశాలకు ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీలకు సమాధానం ఇచ్చారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి ఇది కేవలం పెదవి విప్పడం కాదని అన్నారు. ప్రాక్టికల్‌గా డెవలప్‌ చేసి ఇప్పుడు సభకు చెబుతున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, రాజకీయ సుస్థిరత నెలకొందని, ప్రజలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
 
ఈశాన్య ప్రాంతం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో.. ఈశాన్య ప్రాంతంలో శాంతి, రాజకీయ స్థిరత్వం ఉందని, ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష సభ్యుడు చేసిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు. గత బడ్జెట్‌కు ముందు.. తాను ఈశాన్య ముఖ్యమంత్రులు,ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. వారి సూచనల ఆధారంగా.. జీవనోపాధి కోసం.. 2022 బడ్జెట్ నుండి ప్రత్యేక కేటాయింపులు జరిగాయని తెలిపారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. ఈశాన్య రాష్ట్రాల్లో యువత వలసలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

గత ఎనిమిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి చేసిన కృషి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ చేయలేదన్నారు. మీ (కాంగ్రెస్) హయాంలో యువత తుపాకులు పట్టుకుని తిరిగేవారని అన్నారు.  ఈశాన్య రాష్ట్రాలను బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పథంలో తీసుకెళ్తోందన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలిక లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఉందని, ముఖ్యమంత్రులు తమ పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఉద్యోగాల కోసం గత మూడేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల నుంచి యువత పెద్ద ఎత్తున వలసలు వెళ్లారని, ఏయే రాష్ట్రాలకు వలసలు ఎక్కువగా జరుగుతున్నాయనే వివరాలను అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా లేదని మంత్రి చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఈశాన్య ప్రాంత (NER) రాష్ట్రాల్లో 1,52,05,214 మంది వలసదారులు ఉన్నారు. వీరిలో 93.80 శాతం (1,42,62,490) రాష్ట్రాంతర వలసదారులు, 6.20 శాతం మాత్రమే (9 ,44,050) అంతర్-రాష్ట్ర వలసదారులు ఉన్నాయి. 

ఇంటర్-స్టేట్ మైగ్రేషన్‌లో ఆల్ ఇండియా ఫిగర్ 11.90 శాతం ఉండగా.. ఇంట్రా-స్టేట్ వలసలు  88.10 శాతంగా ఉన్నాయి. NER రాష్ట్రాల నుండి అంతర్-రాష్ట్ర వలసలు జరిగే మొదటి మూడు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ (39.56 శాతం), ఢిల్లీ. (7.66 శాతం), మహారాష్ట్ర (7.4 శాతం) అని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios