కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బెంగళూరులోని సరస్సులను పరిశీలించారు. వాటిని సంస్కరించి, పునరుజ్జీవింపచేయడానికి, అమృత సరోవర్ ప్రాజెక్టు కిందకు తేవడానికి ఆయన కెంపంబుధి, గుబ్బలాల, మేస్త్రిపాల్య సరస్సులను సందర్శించారు. ఎమ్మెల్యేలు ఎం క్రిష్ణప్ప, వి సుబ్రమణ్య ఎల్, ఉదయ్ బీ గురుదాచర్‌లూ కేంద్ర మంత్రితో పాటే ఉన్నారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమృత్ సరోవర్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమీక్షించారు. 75 అమృత సరోవర్‌లను అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఉనికిలో ఉన్న సరస్సులను సంస్కరించి, పునరుజ్జీవం గావించడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రాప్రెన్యూర్షిప్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బెంగళూరులోని కెంపంబుధి, గుబ్బాలాల, మేస్త్రిపాల్య సరస్సులను సందర్శించారు. ఈ చెరువులను అమృత్ సరోవర్ ప్రాజెక్టులో వీటిని చేర్చి అభివృద్ధి చేయాలనే
లక్ష్యంతో ఈ సందర్శన సాగింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెంట ఎమ్మెల్యే ఎం క్రిష్ణప్ప, రవి సుబ్రమణ్య ఎల్, ఉదయ్ బీ గరుదాచర్‌లూ వెళ్లారు. చెరువుల నిపుణులు, స్థానిక పౌరులు కూడా వీరితో పర్యటించారు. ఈ చెరువులను కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పరిశీలించారు. వాటిని ఎలా అభివృద్ధి చేయాలనే చర్చలు జరిపారు.
నీటి వనరులను కాపాడుకోవడానికి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చర్యలు తీసుకుంటున్నారు. నీటి వనరులను పరిరక్షించుకోవడంతోపాటు కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు ఆయన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడమే కాకుండా పర్యవేక్షిస్తూ ఉన్నారు. బెంగళూరులోని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సిటిజన్ వాలంటీర్లు చెరువులు, కుంటలను పరిరక్షించడానికి పాటుపడి పని చేస్తున్నారు. బెంగళూరు వ్యాప్తంగా చెరువులను కాపాడుకోవడంలో కేంద్రమంత్రి పాటుపడుతున్నారు.
వీటితోపాటు బెంగళూరులోని అనేక కబ్జాలకు గురైన మేస్త్రిపాల్య సరస్సుకు మళ్లీ జీవం పోయడంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ క్రియాశీలక పాత్ర పోషించారు. అంతేకాదు, బెల్లందూర్, వర్తూర్, రాంపుర, యెలహంకా, హొరామావు, సారక్కి వంటి చెరువులను అంతర్ధానమై పోకుండా పరిరక్షించడంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కృషి ఉన్నది. బెంగళూరులో నీటి వనరులను కాపాడుకోవడానికి ఆయన కొన్నేళ్లుగా నిర్విరామంగా అనేక సంఘాలు, స్థానిక కమ్యూనిటీలు, న్యాయ నిపుణులు, ఇతరులతో కలిసి పని
చేస్తున్నారు.
ఇటీవలే కేంద్ర మంత్రి యూపీ ప్రభుత్వం చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రోగ్రామ్‌ను కొనియాడుతూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో రెండో సారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాలను డిజిటలైజ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సర్వీసులు రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయనుంది. ఒక్క క్లిక్‌తో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ఎలా పొందాలో తెలిపే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు వివరిస్తున్న ఓ కథనాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లోని అన్ని గ్రామాలను డిజిటల్ చేయనుంది అని ట్వీట్ చేశారు.
