యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తరఫున బోరిస్ జాన్సన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆయనను రిసీవ్ చేసుకున్నారు. 

న్యూఢిల్లీ: యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఢిల్లీలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. గుజరాత్‌లో తొలి రోజు పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన జాన్సన్‌ను ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రిసీవ్ చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తరఫున యూకే పీఎం బోరిస్ జాన్సన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. యూకే ప్రధానిని రిసీవ్ చేసుకున్న తర్వాత కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రభుత్వంలోని తోటి మంత్రుల తరఫున యూకే పీఎం బోరిస్ జాన్సన్‌కు స్వాగతం పలికే అవకాశం లభించిందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌కు వచ్చారు. అహ్మదాబాద్‌లో తన పర్యటన మొదలైంది. తన పర్యటనలోని తొలి రోజును ఆయన గుజరాత్‌లో గడిపారు. సబర్మతి ఆశ్రమం పర్యటించి చర్ఖా తిప్పారు. గాంధీనగర్‌లోని స్వామినారాయణ్ సెక్ట్‌కు చెందిన అక్షరదామ్ టెంపుల్‌నూ సందర్శించారు. అదే విధంగా ఓ జేసీబీ తయారీ యూనిట్‌నూ సందర్శించారు. గురువారం రాత్రి ఆయన ఢిల్లీకి ప్రయాణం అయ్యారు.

ఈ రోజు బోరిస్ జాన్సన్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో కలిశారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్, యూకేల మధ్య సంబంధాలను పేర్కొంటూ.. యూకే, ఇండియాల మధ్య ఇంతటి దృఢమైన బంధం ఇది వరకు ఎప్పుడూ లేదని వివరించారు.

Scroll to load tweet…

గుజరాత్ ప్రజలు ఫెంటాస్టిక్‌గా వెల్‌కమ్ చెప్పారని బోరిస్ జాన్సన్ అన్నారు. ఇది నిజంగా అసాధారణం అని వివరించారు. ఇంతటి ఘన స్వాగతం తనకు ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలోనూ లభించలేదని అన్నారు. తొలిసారి ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌ను చూడటం కూడా చాలా బాగుంది అని పేర్కొన్నారు. 

నరేంద్ర మోడీ తనకు ఖాస్ దోస్తు (ప్రియమిత్రుడు) అని పేర్కొన్నారు. ఈ మాటను తాను హిందీలోనే వాడాలని అనుకున్నట్టు తెలిపారు. ఇండియాలో తాము తాము రెండు అద్భుతమైన రోజులు గడిపామని వివరించారు. ప్రధాని మోడీ జన్మించిన రాష్ట్రం గుజరాత్‌ను పర్యటించిన తొలి కన్జర్వేటివ్ బ్రిటన్ ప్రధాని తానే అని బోరిస్ జాన్సన్ తెలిపారు. అంతేకాదు, సగం బ్రిటీష్ ఇండియన్లకు ఈ రాష్ట్రమే పుట్టిళ్లు అని వివరించారు. తనకు ఈ రాష్ట్రం నుంచి గొప్ప స్వాగతం లభించిందని పేర్కొన్నారు. ‘నేనైతే సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యాను’ అని అన్నారు. అమితాబ్ బచ్చన్‌లాగే ఎక్కడ చూసినా తన ముఖమే కనిపించిందని తెలిపారు.

రెండు రోజుల Indiaపర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధాని Boris Johnson శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని Narendra Modi బోరిస్ జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు.