కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన విమర్శలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిప్పికొట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కి సవరణలు సెన్సార్‌షిప్‌కు దారితీస్తాయనే ఆందోళనలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోపిపుచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన విమర్శలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిప్పికొట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కి సవరణలు సెన్సార్‌షిప్‌కు దారితీస్తాయనే ఆందోళనలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోపిపుచ్చారు. నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించడానికి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే దీనిపై పలువురు విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సీతారాం ఏచూరి కూడా కేంద్రంపై విమర్శలు చేశారు. ‘‘సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసిన కంటెంట్‌ను సెన్సార్ చేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు అధికారాలు ఇవ్వడం క్రూరమైనది. ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఆమోదయోగ్యం కాదు. సెన్సార్‌షిప్, ప్రజాస్వామ్యం సహజీవనం చేయలేవు. ఐటీ నిబంధనలకు ఈ సవరణలను వెంటనే రద్దు చేయండి’’ అని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.
అయితే దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ఆయన ట్వీట్ ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం లేదా అజ్ఞానాన్ని ట్వీట్‌గా మార్చినట్టుగా కనిపిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కఠినమైన చర్య అనే ఆరోపణలను తిరస్కరించారు. ఐటీ రూల్స్.. 2022 అక్టోబర్ నుంచే సోషల్ మీడియా ఇంటర్ మీడియారీస్ ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం లీగల్ ఇమ్యూనిటీని కలిగి ఉండాలంటే నిర్దిష్ట సమయాల్లో కంటెంట్‌ను తీసుకెళ్లకూడదనే నిబంధనలు కలిగి ఉన్నాయని చెప్పారు.
సోషల్ మీడియా ఇంటర్ మీడియారీస్ ఇప్పుడు వారికి సహాయం చేయవలసి ఉంటుందని.. ‘‘అన్ని ప్రభుత్వ సంబంధిత కంటెంట్ కోసం ఒక కొత్త విశ్వసనీయ ఫ్యాక్ట్ చెక్ యూనిట్’’ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సోషల్ మీడియా ఇంటర్ మీడియారీస్ ఫ్యాక్ట్ చెక్‌ను అనుసరించే లేదా విస్మరించే ఎంపికను కలిగి ఉంటారని చెప్పారు. ఫ్యాక్ట్ చెక్‌ను విస్మరించాలని వారు ఎంచుకుంటే.. సంబంధిత శాఖ సోషల్ మీడియా ఇంటర్ మీడియారీస్‌పై చట్టపరమైన పరిష్కారాన్ని అనుసరించవచ్చని అన్నారు.
తమ నాగరిలకులందరికీ ఇంటర్నెట్ సురక్షితమైనదని నిర్ధారించడం తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. అలాగే కేరళలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ‘‘కామ్రేడ్ ఏచూరి - మీడియా ఛానెళ్లపై దాడులు చేసే పినరయి ప్రభుత్వంపై "కఠినమైన" ట్వీట్‌లను మీరు డైరెక్ట్ చేయడం చాలా సముచితం’’ అని పేర్కొన్నారు.
‘‘కామ్రేడ్ ఏచూరికి, కామ్రేడ్ రాహుల్, అన్ని ఇతర వామపక్షాలు, పేరు లేని ఉద్దవ్ పార్టీ.. ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ భారతదేశంలో తప్పుడు సమాచారం లేని ఇంటర్నెట్‌ను రూపొందించడంలో మా తీవ్రమైన పనిని తప్పుగా సూచించడానికి, అబద్ధాలు చెప్పడానికి మీ ఇద్దరు లేదా ముగ్గురు స్నేహితులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. స్వేచ్ఛా ప్రసంగంపై మీ ఉమ్మడి భయంకరమైన క్రూరమైన రికార్డును నేను మీకు గుర్తు చేస్తాను. ఉదాహరణ.. ఐటీ చట్టం Sec66A ఉపయోగించి యువ కార్టూనిస్టులు కార్టూన్లు వేసినందుకు జైలుకు పంపించారు’’ అని విపక్షాలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు.
