Asianet News TeluguAsianet News Telugu

భారత్‌కన్నా పాక్ ఆర్ధిక వ్యవస్థే బెటరన్న ఇమ్రాన్... కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రియాక్షన్ ఇది

పాకిస్తాన్ (pakistan) ఆర్థిక పరిస్థితి భారత్‌కన్నా మెరుగ్గా ఉందంటూ ఇటీవల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (imran khan) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandrasekhar) కౌంటరిచ్చారు. 

union minister Rajeev Chandrasekhar counter to Pakistan PM Imran Khan remarks on indian economy
Author
New Delhi, First Published Jan 12, 2022, 11:26 PM IST

పాకిస్తాన్ (pakistan) ఆర్థిక పరిస్థితి భారత్‌కన్నా మెరుగ్గా ఉందంటూ ఇటీవల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (imran khan) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandrasekhar) కౌంటరిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు ''అవును..మీకు సిద్ధూ ఉన్నాడు. మా దగ్గర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ, భారీ సంఖ్యలో స్టార్టప్‌ కంపెనీలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే ఉన్నాయి'' అంటూ రాజీవ్ సెటైర్లు వేశారు.

మంగళవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంబర్స్ సమ్మిట్-2022లో (international chambers summit 2022) పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇప్పటికీ చౌకైన దేశాలలో ఒకటి అన్నారు. మీరు మమ్మల్ని అసమర్ధులు అని తిట్టి పోయవచ్చు... కానీ తమ ప్రభుత్వం ఎన్నో సంక్షోభాల నుంచి దేశాన్ని రక్షించింది. ఇతర దేశాలకంటే పాకిస్తాన్‌లో ఆయిల్ ధర చాలా తక్కువ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 

అక్కడితో ఆగకుండా భారత ఆర్థిక వ్యవస్థపైనా (indian economy) పాక్ ప్రధాని కామెంట్ చేశారు. భారత్ మనకన్నా ఏమాత్రం ముందుంది? వారి వృద్ధిరేటు మైనస్‌కు చేరుకుందన్నారు. కోవిడ్ కారణంగా 10 లక్షల మంది చనిపోయారని అధికారికంగా చెబుతున్నారని.. కానీ, 30 లక్షలమంది వరకు చనిపోయారని కొందరంటున్నారని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. దేవుడు ఎంత పని చేశాడో చూడండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్.. ప్రధాని వ్యాఖ్యలపై నేషనల్ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తారు. ఒక వైపు అణ్వస్త్ర దేశంగా ఉంటూ, మరోవైపు చిప్ప పట్టుకుని అడుక్కోవడం ఎలా సాధ్యమంటూ దెబ్బిపొడిచారు. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం దివాలా తీయించిందని షరీఫ్ విమర్శించారు.

కాగా.. పంజాబ్ పీసీసీ చీఫ్ (punjab pcc chief) నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ (navjot singh sidhu 0 గతేడాది నవంబర్‌లో ఇమ్రాన్ ఖాన్‌ను పెద్దన్నయ్యగా పిలిచి దుమారం రేకెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. అందులో సిద్ధూ.. దర్బార్ సాహిబ్ గురుద్వారాను (darbar sahib gurdwara) (కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా) (kartarpur corridor) సందర్శించారు. దీనికి ముందు సిద్ధూకి పాకిస్తాన్‌కు చెందిన అధికారి ఘనస్వాగతం పలికి.. దండలు వేశాడు. ఈ సందర్భంగానే ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్నయ్య అని సిద్ధూ వ్యాఖ్యానించారు. 

ఈ క్రమంలో సిద్ధూపై బీజేపీ విరుచుకుపడింది. సిద్ధూని పాకిస్తాన్ ప్రేమికుడు అంటూ అభివర్ణించింది. సీనియర్ నేత అమరీందర్ సింగ్ (amarinder singh) కంటే కాంగ్రెస్ అతనికి ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించింది. నవ్‌జోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోని తన సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా అమరీందర్ సింగ్ గతేడాది తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 


 

Follow Us:
Download App:
  • android
  • ios