Puthuppally bypoll: త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లిజిన్ లాల్ తరపున ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొట్టాయం జిల్లా పుతుపల్లి చేరుకున్నారు. పుత్తుపల్లిలో ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధించిన ప్రగతిని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.
Puthuppally bypoll: గత ప్రభుత్వాలు రూ. 100 పంపిణీ చేస్తే.. లబ్ధిదారునికి కేవలం రూ. 15 మాత్రమే చేరేవనీ, రూ.85 పాలకులు, మధ్యవర్తులే లాక్కునేవారని, ఇది ఆనాటి పాలనా వైఫల్యమని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. కానీ మోడీ పాలన ఆ పరిస్థితి పూర్తిగా మారిందనీ, తమ ప్రభుత్వంలో రూ. 100 విడుదల చేస్తే.. లబ్దిదారునికి రూ. 100 లు నేరుగా చేరుతుందని పేర్కొన్నారు.
పుత్తుపల్లి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి జి లిజిన్ లాల్ కోసం కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం (ఆగస్టు 30) ప్రచారం నిర్వహించారు. పుతుపల్లి ప్రచారంలో భాగంగా ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధించిన ప్రగతిని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.
2014 వరకు 90 శాతం మొబైల్ ఫోన్లు అమెరికా, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని, ప్రధాని మోడీ ప్రభుత్వం లో తీసుకున్న సమర్థ నిర్ణయాల వల్ల 2023 నాటికి భారతదేశం మొబైల్ ఫోన్‌ల ప్రధాన తయారీదారుగా అవతరించిందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2014 వరకు మొబైల్ ఫోన్ సంబంధిత వస్తువులను ఎగుమతి చేయలేదు, కానీ.. 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో తయారైన యాపిల్, సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు మొత్తం లక్ష కోట్లలో USA, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయబడ్డాయనీ, ఈ విధమైన మార్పు గత తొమ్మిదేళ్లలో సంభవించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యం
గత ప్రభుత్వాలు రూ. 100 విడుదల చేస్తే.. లబ్ధిదారునికి కేవలం రూ. 15 మాత్రమే చేరేవనీ, రూ.85 పాలకులు, మధ్యవర్తులే మింగేసేవారని, ఇది ఆనాటి పాలనా వైఫల్యమని విమర్శించారు. కానీ మోడీ పాలన ఆ పరిస్థితి పూర్తిగా మారిందనీ, తమ ప్రభుత్వంలో రూ. 100 విడుదల చేస్తే.. లబ్దిదారునికి రూ. 100 లు నేరుగా చేరుతాయని, ఎలాంటి మధ్యవర్తులు, దోపిడిదారుల ప్రమేయం ఉందని వివరించారనీ, తమ ప్రభుత్వం చేసిన కీలక మార్పు అని పేర్కొన్నారు.
సామర్థ్య రక్షణ రంగం
2014కి ముందు భారత సాయుధ శక్తి, రక్షణ రంగం చాలా బలహీనంగా ఉండేదనీ, కనీసం పునరుద్ధరించడానికి గత ప్రభుత్వాని సుముఖత కూడా చూపలేవని విమర్శించారు. ఆ సమయంలో భారతదేశంపై చైనా నిఘా పెట్టిన అడ్డుకునే శక్తి లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు తాను చేసినవి కావనీ స్వయంగా ఆనాటి కాంగ్రెస్ రక్షణ మంత్రి లోక్‌సభలో ప్రస్తవించిన మాటలని అన్నారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని, మన దేశ రక్షణ రంగంలోని మౌలిక సదుపాయాలను చూసి చైనా ఆందోళన చెందుతుందని అన్నారు. ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం గా భారత్ ఆవిర్భవించిందని, ఈ ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు
నిరుద్యోగంపై తప్పుడు కథనాలు
దేశంలో ఉపాధి లేదా నిరుద్యోగంపై తప్పుడు కథనాలు ప్రచారంలో ఉన్నాయనీ, 2014 కి ముందు భారతదేశంలో 42 కోట్ల మంది శ్రామిక శక్తి ఉందనీ. మొత్తం 31 కోట్ల మంది యువకులు విద్యావంతులు లేదా నైపుణ్యం లేనివారు. కాంగ్రెస్, లెఫ్ట్, UPA లేదా భారతదేశం యొక్క 65 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత దేశం యొక్క రిపోర్ట్ కార్డ్ ఈ సంఖ్యలను వెల్లడించింది.
భారతదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విద్య, నైపుణ్యాలు రెండూ లేవు.దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఏ నైపుణ్యాలు లేకుండా ప్రతి సంవత్సరం వర్క్‌ఫోర్స్‌లోకి వస్తున్నారని తెలిపారు. అయితే.. ఆ పరిస్థితిని మార్చడానికి మోదీ ప్రభుత్వ హయాంలో గత 8 సంవత్సరాల కాలంలో 6.5 కోట్ల మంది భారతీయ యువకులు ఇ-స్కిల్స్ , అప్‌స్కిల్స్‌తో సహా నైపుణ్యాలను అందిస్తున్నామని తెలిపారు.
యువతే దేశానికి బలం
భారతదేశానికి యువతే బలమనీ, ఏ దేశానికి లేని యువశక్తి మనదేశానికి ఉందని అన్నారు. ఆ యువశక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే.. సాధికారత,అభివృద్ధి, ఆర్థిక వృద్ధిసహా సమర్థవంతమైన రాజకీయాలను ఆచరించాలని అన్నారు. మొదటిసారిగా మన దేశం ప్రగతి దిశగా పయనించడాన్ని మనం చూడవచ్చనీ, గత 65 ఏండ్ల పాలన మనల్నీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంచిందనీ, కాంగ్రెస్ (65 సంవత్సరాల పాలన) పరిపాలనలో విభజన, హింసాత్మక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నామని తెలిపారు. 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్ సబ్‌కా ప్రయాస్' అనే నినాదంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతోందని, దేశాన్ని పురోగమింపజేయడానికి బీజేపీ పాత్ర ఎంతో ఉందని అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
