కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వందేమాతరంను అంగీకరించని వారికి దేశంలో జీవించే హక్కు లేదన్నారు.

ఆదివారం ఒడిశాలోని బాలోసోర్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసినప్పుడు ఒక్క కాంగ్రెస్ తప్ప మిగిలిన విపక్షాలన్నీ ప్రతిపక్షపార్టీలు మద్ధతుగా నిలిచాయని సారంగి గుర్తుచేశారు.

ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్, సియాచిన్‌లు భారత్‌లోని అంతర్భాగాలేని అమిత్ షా కాంగ్రెస్ నాయకులకు స్పష్టత ఇచ్చారన్నారు. వందేమాతరాన్ని అంగీకరించని వారికి భారతదేశంలో జీవించే హక్కులేదని ప్రతాప్ చంద్ర వ్యాఖ్యానించారు.

72 సంవత్సరాల తర్వాత నరేంద్రమోడీ కాశ్మీర్‌ ప్రజలకు అన్ని హక్కులను కల్పిస్తే కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం సబబు కాదన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ఉగ్రవాదులు, వారి మద్ధతుదారులకు అండగా నిలిచిన వారు ఎక్కువగా బాధపడుతున్నారని సారంగి వెల్లడించారు.