Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు: కేంద్ర మంత్రి నిర్మలా సీరియస్

 కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో కొన్ని ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై  పెద్ద ఎత్తున ఫిర్యాదులు  వెల్లువెత్తాయి.  ఈ విషయమై కేంద్రం సీరియస్ అయింది.  

union minister NIramala Sitaraman warns to private hospitals lns
Author
New Delhi, First Published Apr 28, 2021, 11:34 AM IST

న్యూఢిల్లీ: కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో కొన్ని ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై  పెద్ద ఎత్తున ఫిర్యాదులు  వెల్లువెత్తాయి.  ఈ విషయమై కేంద్రం సీరియస్ అయింది.  ఆరోగ్య భీమా ఉన్న రోగులకు నగదు రహితంగా  చికిత్స చేసేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి.  ఇన్సూరెన్స్ ఉన్నా కూడ  డబ్బులుచెల్లిస్తేనే  చికిత్స చేస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయని పలువురు ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేస్తున్నారు. 

దేశంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకొంది. ఆరోగ్య భీమా ఉన్న రోగులకు ఉచితంగా చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే  కఠిన చర్యలు తీసుకొంటామని  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు.  

దేశ వ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో ఇదే తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. మరో వైపు  తెలుగు రాష్ట్రాల్లో కూడ  ఇదే తరహా ఘటనలు  వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడ  ప్రైవేట్ ఆసుపత్రులు  మొత్తం ఫీజులు చెల్లిస్తేనే మృతదేహలు ఇచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

 


 

Follow Us:
Download App:
  • android
  • ios