మొక్కజొన్న పొత్తుల కోసం స్వయంగా కారు దిగి దుకాణదారుతో బేరమాడారు కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సాధారణంగా మనం బజారులో ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు బేరాలు అడగటం నిత్యకృత్యమే. ఫిక్స్‌డ్ రేట్లు వచ్చిన తర్వాత కూడా ఈ బేరాల అలవాట్లు చాలా మందిని వీడి పోలేదు. అయితే బేరాలు అడగటం అంత ఈజీ కాదు.. కొందరు దీనిలో ఆరి తేరిన వారున్నారు. అవసరమైతే నోటికి కూడా పనిచెప్పగలరు. అయితే కేంద్ర మంత్రి వంటి అత్యున్నత స్థాయిలో వుండి కూడా తాను సామాన్యుడినేనని నిరూపించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ( faggan singh kulasti) 

వివరాల్లోకి వెళితే.. ఆయన ఏదో పని మీద కారులో వెళ్తుండగా.. రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులపై ఆయన కన్ను పడింది. అంతే కాన్వాయ్‌ని ఆపి.. దుకాణంలో వున్న ఓ పిల్లాడితో మూడు పొత్తులను కాల్పించి, ఉప్పు రాయించుకున్నారు. ఆ తరవాత ఒక్కోటీ ఎంత అని కులస్తే అడిగారు. దీనికి రూ.15 అని చెప్పగా.. అంటే మూడు పొత్తులు రూ.45 అన్నమాట అని కేంద్ర మంత్రి అన్నారు. ఇంత అధిక ధరకు అమ్ముతావా అని ప్రశ్నించారు. దీనికి ఆ కుర్రాడు జవాబిస్తూ.. రూ.15 అనేది ఫిక్స్‌డ్ రేట్ అని.. మీకు కారు వుందని ధర పెంచలేదన్నాడు. 

అనంతరం ఇక్కడ మొక్కజొన్న ఫ్రీగానే దొరుకుతుందని .. ఇలా రకరకాల ప్రశ్నల తర్వాత చివరికి రూ.45 చెల్లించి వచ్చేశారు కేంద్రమంత్రి. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆ పిల్లాడిని చూస్తే చాలా పేదవాడిలా వున్నాడని.. ఒక్క మొక్క జోన్న కంకికి రూ.15 అంటే చాలా ఎక్కువలాగా వుందా అంటూ భగ్గుమన్నాయి. దీనికి బీజేపీ (bjp) గట్టిగా కౌంటరిచ్చింది. కేంద్ర మంత్రి అయ్యుండి కూడా కారు ఆపి మరి మొక్కజొన్నలు కొనుగోలు చేశారని పులస్తేను సమర్ధించింది. 

Scroll to load tweet…