Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్-3 అంతరిక్ష మిషన్ ఈ ఏడాది ఆగస్టు లో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి (సైన్స్ అండ్ టెక్నాలజీ) డాక్టర్ జితేందర్ సింగ్ వెల్లడించారు. పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సంబంధిత వివరాలు తెలియజేశారు.
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్-3 (Chandrayaan-3) అంతరిక్ష మిషన్ ఏడాది ఆగస్టు లో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి (సైన్స్ అండ్ టెక్నాలజీ) డాక్టర్ జితేందర్ సింగ్ (Dr Jitendra Singh) వెల్లడించారు. పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సంబంధిత వివరాలు తెలియజేశారు. బుధవారం నాడు లోక్‌సభలో అంతరిక్ష ప్రయోగాలు, ఈ ఏడాది చేపట్టబోయే మిషన్ల వివరాలు, గత ప్రయోగాల వివరాలు తెలియజేయాలని ఓ సభ్యుడు కోరారు.
ఈ నేపథ్యంలోనే అంతరిక్ష ప్రయోగాలు, ఇస్రో (Indian Space & Research Organisation) చేపట్టబోయే మిషన్ల గురించి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇదివరకు నిర్వహించిన విఫలమైన చద్రయాన్ మిషన్ల నుంచి అనేక విషయాలు తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-2 (Chandrayaan-2) నుండి నేర్చుకున్న అంశాలు, జాతీయ స్థాయి నిపుణుల సూచనల ఆధారంగా చంద్రయాన్-3 (Chandrayaan-3)కి సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ఇప్పటికే చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించి మంచి పురోగతిలో ఉన్నామనీ, దీనికి సంబంధించిన అనేక హార్డ్‌వేర్, ఇతర ప్రత్యేక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ లాంచ్ ఈ ఏడాది ఆగస్టు లో షెడ్యూల్ చేయబడిందని చెప్పారు.
ఈ ఏడాదిలో (2022 జనవరి-డిసెంబర్ వరకు) ఇస్రో (Indian Space & Research Organisation) మొత్తం 19 అంతరిక్ష మిషన్లను చేపట్టబోతున్నదని మంత్రి తెలిపారు. ఈ 19 మిషన్లలో 08 లాంచ్ వెహికల్ మిషన్లు, 07 స్పేస్ క్రాఫ్ట్ మిషన్లు, 04 టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ మిషన్లు ఉన్నాయని తెలిపారు. అలాగే, COVID-19 మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. కరోనా మహమ్మారి ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అంతరిక్ష మిషన్లను తీవ్రంగా ప్రభావితం చేసిందని తెలిపారు. అలాగే, స్పేస్ సెక్టార్ సంస్కరణలు, కొత్తగా ప్రవేశపెట్టిన డిమాండ్ ఆధారిత నమూనాల బ్యాక్ డ్రాప్‌లో ప్రాజెక్ట్‌ల పునఃప్రాధాన్యత కూడా జరిగిందని పేర్కొన్నారు. అలాగే, గత 3 సంవత్సరాలలో భారత్ చేపట్టిన మిషన్ల వివరాలు కూడా తెలియజేశారు.
కాగా, 2019 చంద్రయాన్-2 మిషన్ ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నిర్వహించింది. అయితే, చంద్రయాన్-2 మిషన్ చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైంది. దాని నుంచి వచ్చిన అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని ఇస్రో చంద్రయాన్మూ-3 మిషన్ ను విజయవంతంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి చీకటి వైపున (డార్క్ సైడ్) రోవర్‌ను ల్యాండ్ చేయాలనే ప్రణాళిక ఉంది. కోట్లాది సంవత్సరాలుగా సూర్యకాంతి పడని ప్రదేశం అది. ఈ భాగంలో మంచు, ముఖ్యమైన ఖనిజాలు ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. భారత్ తో పాటు అనేక దేశాలు చంద్రునిపై అంతుచిక్కని రహస్యాలను ఛేదించడానికి అంతరిక్ష మిషన్లకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఖనిజలవణాలు, నీట జాడను కనుగోనే లక్ష్యంగానే అన్ని దేశాలు చంద్రునికి సంబంధించిన అంతరిక్ష మిషన్లలో ముందుకు సాగుతున్నాయి.
