దేశంలో కోవిడ్ బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే వుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.

వైద్య పరీక్షల్లో తనకు పాజిటివ్‌‌గా తేలినట్లు మంత్రి సోమవారం నాడు తెలిపారు. వైద్యుల సలహా మేరకు తాను హోం ఐసొలేషన్‌లో ఉన్నానని, తన ఆరోగ్యం నిలకడగా వుందని అశ్విని చెప్పారు.

కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం పరీక్ష చేయించుకున్నట్టు చౌబే తెలిపారు. ప్రస్తతుం హోం ఐసొలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇదే సమయంలో గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు ఐసొలేషన్‌ పాటిస్తూ, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు