Asianet News TeluguAsianet News Telugu

 ఆయన నపుంసకుడు.. బీహార్ సీఎంపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి అశ్విని చౌబే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ నపుంసకుడని ఆయన విమర్శించారు, బీహార్‌లో నేరాలు పెరిగిపోయాయని, కానీ సీఎం నితీశ్ కుమార్ మాత్రం పట్టించుకోవడవం లేదని అన్నారు

Union Minister Ashwini Choubey Says Nitish Kumar Victim Of Impotence
Author
First Published Dec 7, 2022, 7:02 PM IST

బీహార్‌లో బీజేపీతో జేడీయూ తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి బీజేపీ నేతలు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో బీహార్ ప్రభుత్వం, సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తాజాగా బీహార్ సీఎం నితీష్‌ కుమార్ పై కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నపుంసకుడని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో రోజురోజుకు నేర ఘటనలు పెరిగిపోతున్నాయని బీహార్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన అన్నారు. రెండు రోజుల కిత్రం.. బీహార్ లోని భాగల్పూర్‌లో నీలమ్‌ అనే మహిళను ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. రద్దీగా ఉన్న మార్కెట్‌లో కత్తులతో ఆమెపై దాడి చేసి విచక్షణరహితంగా చేతులు, రొమ్ములు, చెవులను నరికి చంపారు. ఈ ఘటనపై స్పందిస్తూ కేంద్ర మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

కైమూర్ జిల్లాలో జిల్లా స్థాయి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి చేరుకున్న కేంద్ర మంత్రి చౌబే మీడియాతో మాట్లాడుతూ..  బీహార్ ముఖ్యమంత్రి నపుంసకత్వానికి బలి అయ్యారనీ,  బీహార్‌లో నేర సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని విమర్శించారు. కానీ, ముఖ్యమంత్రి ఏమీ చేయడం లేదు. బీహార్‌లో మళ్లీ జంగిల్ రాజ్ రిటర్న్స్ ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. బీహార్‌లో జంగిల్ రాజ్‌ను తిరిగి తీసుకురావడంలో నితీష్‌కుమార్‌ పాత్ర ఉందని, అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీహార్‌ను జంగిల్ రాజ్ నుంచి విముక్తి చేస్తానని హామీ ఇవ్వడం ద్వారా నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. కానీ, ఆయన మరోసారి బీహార్‌ను జంగిల్ రాజ్ వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని అశ్విని చౌబే అన్నారు. 

ముజఫర్‌పూర్‌లోని కుధాని అసెంబ్లీ ఉప ఎన్నిక గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా భారత ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తోందని అన్నారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధిస్తోందని అన్నారు. బీహార్‌లోని కుధాని ఉప ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు.దీంతో పాటు.. బీహార్‌లో పెరుగుతున్న నేరాలపై ప్రభుత్వాన్ని విమర్శించారు. 

మహిళల చేతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారని, ఇది జంగిల్ రాజ్ కాకపోతే మరేమిటని కేంద్ర మంత్రి అశ్విని చౌబే ప్రశ్నించారు. 48 గంటల్లో ఆరు ఘోర నేరాలు జరిగాయని తెలిపారు. వెంటనే నితీష్ కుమార్ రాజీనామా చేయాలని అన్నారు. మరోవైపు బీహార్‌లోని అధికార జేడీయూకు చెందిన సంజయ్‌ సింగ్‌, కేంద్ర మంత్రి అశ్విని చౌబే వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మానసిక స్థితిని ఇది తెలియజేస్తున్నదంటూ విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios