Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Anurag Thakur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పంజాబ్‌లోని మొహాలీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 
 

Union Minister Anurag Thakur's Comments on Delhi Liquor Scam
Author
First Published Oct 31, 2022, 2:36 PM IST

Delhi liquor scam: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 'మద్యం (పాలసీ) కుంభకోణంలో కింగ్‌పిన్' అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, బెయిల్ పిటిషన్ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారని కూడా ఆయన ప్రస్తావించారు. వివరాల్లోకెళ్తే.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పంజాబ్‌లోని మొహాలీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను గత నెలలో సీబీఐ ప్రశ్నించింది.

ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ(ఆప్‌) త‌న విమ‌ర్శ‌ల దాడికి కొన‌సాగించిన మంత్రి..  వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో త‌న అవినీతి ప్రదర్శన చూస్తుంద‌ని విమ‌ర్శించారు. మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, బెయిల్ పిటిషన్ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారని కూడా ఆయన ప్రస్తావించారు. ఇంత‌కుముందు జ‌రిగిన ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల విజ‌యంతో ప్ర‌భుత్వం ఏర్పాటును ప్ర‌స్తావిస్తూ.. హిమాచ‌ల్, గుజ‌రాత్ లో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. "ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ , గోవా మాదిరిగా, మేము హిమాచల్, గుజరాత్‌లో మా ప్రభుత్వాన్ని మ‌ళ్లీ ఏర్పాటు చేస్తాం. ఆప్ పాలిస్తున్న పంజాబ్ చూడండి.. అక్క‌డ అవినీతి గ‌రిష్ట స్థాయికి చేరుకుంది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి అవినీతి కారణంగా జైలులో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో కింగ్‌పిన్ గా ఉన్నారు" అంటూ ఠాకూర్ విమ‌ర్శించారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణం మునిసిపల్ ఎన్నికలకు ముందు AAP vs BJP ఫ్లాష్‌పాయింట్‌గా మారింది. ఇప్పుడు ఇది కోర్టుల‌కు వ‌ర‌కు చేరి.. రెండు పార్టీల‌కు యుద్ధంగా మారింది. కాగా, 2021-22 మద్యం లైసెన్స్‌ల టెండర్ ప్రక్రియకు అనుచిత ప్రయోజనాలను అందించినందుకు గాను సిసోడియా పై ప‌లు రోప‌ణ‌లు వ‌చ్చాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండూ ఇప్పుడు రద్దు చేయబడిన విధానంలో ఆరోపించిన కార్టెలైజేషన్‌ను దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఈడీ ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చుట్టుపక్కల రెండు డజనుకు పైగా ప్రదేశాలపై దాడి చేసింది. ఒక వారం క్రితం హైదరాబాద్ స‌హా  30 కంటే ఎక్కువ ప్రదేశాలపై దాడి చేసిన తర్వాత ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ప్రాథమిక నిందితుడిగా పేర్కొన్న సిసోడియాను విచారణకు పిలిచారు.

త్వ‌ర‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్, గుజ‌రాత్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇరు బీజేపీ, ఆప్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంఇ. బీజేపీ త‌న విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగించింది. ఢిల్లీ ప్రభుత్వ కొత్త విధానం వల్ల ₹ 2,300 కోట్ల నష్టం వాటిల్లిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా పేర్కొన్నారు. అలాగే, ఈ వారంలో కేజ్రీవాల్ గుజరాత్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బీజేపీ ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios