కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ను పొగిడే వారు, భారతదేశానికి వ్యతిరేకంగా ఎజెండా కలిగిన సంస్థలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మద్దతు పలుకుతున్నాయనీ, విదేశాల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కార్యక్రమాలను 'భారత వ్యతిరేక శక్తులు( anti-India forces)'నిర్వహిస్తున్నాయని ఆరోపించారు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విదేశాల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కార్యక్రమాలను 'భారత వ్యతిరేక శక్తులు( anti-India forces)' నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ఈ శక్తులు భారతదేశానికి వ్యతిరేకంగా ఎజెండాతో కొనసాగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పలు ప్రశ్నలు సంధించారు. అలాంటి శక్తులతో కాంగ్రెస్ ఎందుకు సంబంధాలను కొనసాగిస్తుందో దేశానికి చెప్పాలని అన్నారు. దీనికి ఒక రోజు ముందు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. “రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించినప్పుడు ఎవరి మద్దతుతో ఆయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయో దేశానికి తెలియజేయాలని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఎజెండా ఉన్న సంస్థల నుంచి నిధులు సమకూరుస్తారనీ, అందుకే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మాట్లాడుతున్నారని ఆరోపించారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఎజెండాను నడుపుతున్న సంస్థలతో రాహుల్ గాంధీకి సంబంధాలున్నాయని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం గురించి మాట్లాడే వారికి ఇటువంటి సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తాయని కేంద్ర సంచలన ఆరోపణలు చేశారు.
భారత్‌పై విషం చిమ్మే వారికి షాహీన్‌బాగ్ కేసులో సహాయం అందించారని ఠాకూర్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను పొగిడే వారు రాహుల్‌గాంధీకి మద్దతు పలుకుతారని, ఆయన కార్యక్రమాలను పూర్తి చేస్తారని కేంద్రమంత్రి ఆరోపించారు. రాహుల్ గాంధీ , కాంగ్రెస్ పార్టీని ఆయన సూటిగా ప్రశ్నిస్తూ.. "భారత వ్యతిరేక శక్తుల నుండి మద్దతు , సహాయం పొందవలసిన అవసరమేమిటనని నిలదీశారు. భారత వ్యతిరేక శక్తుల నుండి నుంచి సహాయం పొందుతున్నారు కాబట్టే.. రాహుల్ గాంధీ విదేశీ వేదికపై దేశానికి వ్యతిరేకంగా గళం విప్పారని ఠాకూర్ ఆరోపించారు
భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు, అతని బాధ్యతారాహిత్య ప్రవర్తన మణిపూర్‌లో పరిస్థితిని సున్నితం చేసిందని అన్నారు. రాహుల్ తన 'ప్రేమ దుకాణం' తెరవడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారని పాత్రా అన్నారు. మణిపూర్‌లో గాంధీ పర్యటనపై రాష్ట్ర ప్రజలు నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనను పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు వ్యతిరేకించాయని పాత్రా తెలిపారు.
