akhimpur Kheri violence: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన లఖింపూర్ ఖేరీ ఘటన ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. బెయిల్ రావడంపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర స్పందనను మీడియా కోరింది.
Lakhimpur Kheri violence: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన లఖింపూర్ ఖేరీ ఘటన ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. లక్నో హైకోర్టు బెంచ్ నిందితునికి బెయిల్ మంజూరు చేసింది. గురువారం నాడు అలహాబాదు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. సరిగ్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రోజునే ఈ బెయిల్ రావడంతో విమర్శలు మరింత పెరిగాయి.
ఇదిలావుండగా, ఎన్నికల్లో భాగంగా ఆయన లఖీంపూర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ జాతీయ ఛానల్ కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అజయ్ మిశ్రాను కుమారుడి బెయిల్ పై స్పందించమని అడిగింది. బెయిల్ విషయంపై స్పందించమనగా.. ఓ నవ్వు నవ్వి, కారు ఎక్కి, ప్రచారం కోసం వెళ్లిపోయారు. ఇక రైతులను కారుతో తొక్కించి పంపించన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు బెయిల్ లభించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ కూడా స్పందించారు. ఈ స్థానంలో సామాన్యుడు గనక ఉంటే.. ఇంత తొందరగా బెయిల్ దొరికేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
చనిపోయిన వారిలో రైతులు, జర్నలిస్టు..
గత ఏడాది అక్టోబర్ 3న, లఖింపూర్ ఖేరీలోని టికునియా వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా కాన్వాయ్.. రైతులపై దూసుకెళ్లింది. ఈ సమయంలో కాన్వాయ్ లోని రైతులపైకి పోనిచ్చిన కారును నడుపుతున్నది కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రానే ఆరోపణలు ఉన్నాయి. కావాలనే ఈ కుట్రకు పాల్పడ్డారని సిట్ సైతం తేల్చింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రైతులతో పాటు ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు సిరియస్ అయి.. సుమోటోగా కేసును స్వీకరించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆజయ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారునికి బెయిల్ మంజూరు కావడం గమనార్హం.
పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ కుట్ర
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనకు దిగారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా రైతు మహా పంచాయత్ లను నిర్వహించారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 3న, లఖింపూర్ ఖేరీలోని టికునియా వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే సమయంలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనంతో రైతులను ఢీ కొట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృదం (సిట్) విచారణ అనంతరం.. రైతులపైకి కారును పొనిచ్చిన ఘటన అంతా పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర పేర్కొంది. దీని తరువాత, సిట్ 5000 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, అందులో ఆశిష్ మిశ్రా హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటనలో మొత్తం 16 మందిని సిట్ నిందితులుగా పేర్కొంది. నిందితులపై సిట్ ఐపీసీ సెక్షన్లు 307, 326, 302, 34,120బి, 147, 148,149, 3/25/30 అభియోగాలు మోపింది.
