కేంద్ర న్యాయశాఖ మంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు.. తృటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. జమ్ము కశ్మీర్‌లో నిర్వహించిన ఓ లీగల్ సర్వీసెస్ క్యాంప్‌లో పాల్గొనడానికి ఆయన వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఆయన ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
 

union law minister kiren rijiju car met with minor accident, minister safe kms

శ్రీనగర్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కారును ఫుల్ లోడ్‌తో ఉన్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేవు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ట్రక్కు ఢీకొన్న తర్వాత భద్రతా బలగాలు వెంటనే ఆయన కారు వద్దకు పరుగు తీశాయి. ఆ కారు డోర్ ఓపెన్ చేసి అందులోని వారిని బయటకు తీసుకువచ్చారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్‌లోని రాంబన్‌లో ఈ రోజు (శనివారం) చోటుచేసుకుంది.

‘జమ్ము నుంచి శ్రీనగర్‌కు రోడ్డు మార్గాన వెళ్లుతుండగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కారుకు మైనర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కేంద్రమంత్రిని సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్లారు’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కారు బ్లాక్ స్కార్పియోను ఓ ట్రక్కు పక్కగా ఢీకొట్టింది. ఆగి వున్న ఆ స్కార్పియో వద్దకు సెక్యూరిటీ సిబ్బంది వేగంగా వెళ్లారు. ఆ కారు డోర్ ఓపెన్ చేశారు. అందులో నుంచి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు బయటకు వచ్చారు.

Also Read: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి..

జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో లీగల్ సర్వీసెస్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో పాల్గొనడానికి వెళ్లుతుండగా కేంద్రమంత్రికి ఈ ప్రమాదం జరిగింది. 

రోడ్డు మార్గాన వెళ్లుతుండగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఓ వీడియో తీసి ప్రమాదానికి ముందు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందమైన ఈ రోడ్లను చూసి ప్రతి ఒక్కరూ సంతోషిస్తారని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios