పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో పాకిస్తాన్ కూడా అందుకు ధీటుగా బదులిస్తామని హెచ్చరించింది. దీనిలో భాగంగా బుధవారం పాక్ వైమానిక దళంలోని రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభూగంలోకి చొరబడ్డాయి.

పూంచ్ , రాజౌరీ సెక్టార్ల పరిధిలోని సుమారు 3 కిలోమీటర్లు ఇవి ముందుకు వచ్చాయి. వీటిని భారత యుద్ధ విమానాలు వెంబడించి నౌషెరా సెక్టార్‌లో కూల్చి వేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది.

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగతోంది. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో పాటు హోంశాఖ కార్యదర్శి, సైనిక దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.