కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని మనోజ్ తివారీ తెలియజేశారు. కోవిడ్ చికిత్స పొందుతున్న అమిత్ షాకు మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు.

కాగా, ఆగస్టు 2న జరిపిన కరోనా పరీక్షల్లో అమిత్ షాకు పాజిటివ్ ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వైద్యుల సలహా మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల తర్వాత ఆయన కోలుకున్నారు.

మరోవైపు అమిత్ షాను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కైలష్ చౌదరి, అర్జున్ రామ్ మేఘవాల్ కూడా కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే.