Balaghat: వాతావరణం అనుకూలించకపోవడంతో అమిత్ షా హెలికాప్టర్ మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో ల్యాండ్ కాకుండానే తిరిగి వెళ్లింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం, హెలికాప్టర్ దుర్గ్ నుండి బయలుదేరింది, కానీ ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా తిరిగి ఛత్తీస్ గ‌ఢ్ రాజధాని రాయ్ పూర్ వైపు వెళ్ళాల్సి వచ్చింది. 

Amit Shah’s helicopter unable to land in MP: వాతావరణం అనుకూలించకపోవడంతో అమిత్ షా హెలికాప్టర్ మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో ల్యాండ్ కాకుండానే తిరిగి వెళ్లింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం, హెలికాప్టర్ దుర్గ్ నుండి బయలుదేరింది, కానీ ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా తిరిగి ఛత్తీస్ గ‌ఢ్ రాజధాని రాయ్ పూర్ వైపు వెళ్ళాల్సి వచ్చింది.

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తూర్పు మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ నగరంలో గురువారం ల్యాండ్ కాలేదు. దుర్గ్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయినప్పటికీ ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా తిరిగి ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ వైపు వెళ్లాల్సి వచ్చిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పురస్కరించుకుని బాలాఘాట్ లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే సమావేశం జరుగుతుందనీ, మరో రోజు అమిత్ భాయ్ మళ్లీ వస్తారని చౌహాన్ విలేకరులకు తెలిపారు. మధ్యప్రదేశ్ లో 16వ శతాబ్దపు గోండ్వానా పాలకురాలు రాణి దుర్గావతి జ్ఞాపకార్థం ఐదు వీరంగాన రాణి దుర్గావతి గౌరవ్ యాత్రలను అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నెల 27న ప్రధాని మోదీ సమక్షంలో షాడోల్ లో యాత్రలు ముగియనున్నాయి.

ఇదిలావుండ‌గా, అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత గురువారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై మాటల దాడి చేశారు. స్మార్ట్ పార్క్‌లో మొక్కలు నాటిన అనంతరం సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ''నిన్న ప్రపంచం మొత్తం యోగాతో ధన్యమైందన్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా యోగా చేశారు. యోగా దినోత్సవం రోజున కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని' చౌహాన్ అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన పెద్ద నాయకులెవరూ యోగా చేయడం కనిపించలేదని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. యోగా అనేది ఏ కులం-సమాజానికి చెందినది కాదు, యోగా అందరికీ చెందినది, అందరూ అందులో చేరాలని అన్నారు.