ఎల్లుండి రైతులు రోడ్ల దిగ్బంధానికి పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర హోంమంత్రి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఢిల్లీ పోలీస్ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు
ఎల్లుండి రైతులు రోడ్ల దిగ్బంధానికి పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర హోంమంత్రి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఢిల్లీ పోలీస్ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎల్లుండి భద్రతా ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీయడం, ఎర్రకోట ముట్టడి వంటి ఘటనలతో విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి.
ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటూ మండిపడ్డాయి. దాంతో ఎల్లుండి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది కేంద్రం. మరోవైపు 6న రహదారుల దిగ్బంధనానికి రైతులు పిలుపునివ్వడంతో ఘాజీపూర్‌తో పాటు సింఘు, టిక్రీ బోర్డర్‌లో సెక్యూరిటీ టైట్ చేశారు. మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేశారు.
బారికేడ్లతో పాటు ఇనుప చువ్వలు రోడ్లపై ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు ఐరన్ లాఠీలతో పహారా కాయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతికి అడ్డంగా ఐరన్ ప్యాడ్లతో పాటు పెద్ద పెద్ద రాడ్లను పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఐరన్ రాడ్లపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్థానిక పోలీసులే రక్షణ కవచంగా వినియోగిస్తున్నారేమోనని చెప్పారు. జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో రైతులు ఢిల్లీలోకి దూసుకొచ్చారు.
రహదారికి అడ్డంగా బారికేడ్లు, ట్రక్కులు పెట్టినా లెక్కచేయలేదు. వాటన్నింటిని దాటుకుని ముందుకు సాగారు. ఆనాటి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఏకంగా గోడలు కట్టేయడం, మేకులను రోడ్లకు అడ్డంగా వేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఢిల్లీ బోర్డరా లేక దేశ సరిహద్దా అంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
