కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గురువారం మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్య సహాయం అందించిన ఎయిమ్స్ వైద్యులు... షా ఆరోగ్యం కుదటపడటంతో గురువారం డిశ్చార్జ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం వుంది. కాగా ఆగస్టు 2న అమిత్ షాకు పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఎయిమ్స్‌లో చికిత్స పొంది ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే అనారోగ్యం బారినపడటంతో అమిత్ షా తిరిగి ఎయిమ్స్‌లో చేరారు. కాగా పార్లమెంట్‌లోని మొత్తం 785 సభ్యుల్లో 65 అంతకంటే వయసు పైబడిన వారు 200 మంది ఉన్నారు.

వీరిలో కరోనా బారినపడిన వారిలో ఇప్పటి వరకు ఏడుగురు కేంద్రమంత్రులు, 12 మంది ఎంపీలు కోలుకున్నారు. మరోవైపు దేశంలో గురువారం రికార్డు స్థాయిలో 97,894 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 51 లక్షలు దాటగా, ఇప్పటి వరకు 83,000 మంది ప్రాణాలు కోల్పోయారు.