Asianet News TeluguAsianet News Telugu

భారత్‌ బయోటెక్‌ కోవిడ్ నాసల్‌ వ్యాక్సిన్‌‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రులు.. ధర ఎంతంటే..?

భారత్‌లో కరోనా వైరస్‌పై పోరులో మరో ముందడుగు పడింది.కేంద్ర ఆరోగ్య మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఇంకోవాక్ నాసల్ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు.

Union Health Minister Mandaviya launches Bharat Biotech nasal Covid vaccine
Author
First Published Jan 26, 2023, 4:22 PM IST

భారత్‌లో కరోనా వైరస్‌పై పోరులో మరో ముందడుగు పడింది. కోవిడ్‌కు వ్యతిరేకంగా దేశంలోనే మొట్టమొదటి నాసికా వ్యాక్సిన్ ఇది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఇంకోవాక్ నాసల్ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ దేశీయ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు వ్యాక్సిన్ ధర రూ. 800 కాగా..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 325 రూపాయలకే విక్రయించనుంది.

2022 డిసెంబర్‌లో ఇన్‌కోవాక్ నాసల్ వ్యాక్సిన్‌‌ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ రెండు డోసులు పొందినవారు బూస్టర్ డోసుగా ఇంకోవాక్ నాసల్ వాక్సిన్ తీసుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే బూస్టర్ డోస్ తీసుకున్న వారికి నాసికా వ్యాక్సిన్‌ను వేయలేమని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, దీనిని ప్రైమరీ  వ్యాక్సిన్‌గా కూడా తీసుకునేందుకు ఆమోదం లభించింది. అంటే.. ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోయినా.. వారు దీనిని పొందవచ్చు. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు 28 రోజుల తేడాతో తీసుకోవాల్సి ఉంటుంది. కోవిన్ పోర్టల్ ద్వారా నాసల్ వ్యాక్సిన్‌ కోసం స్లాట్ బుక్‌చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఇక, ఈ వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా అందజేయనున్నారు. ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే కరోనా ఇన్ఫెక్షన్, ట్రాన్స్‌మిషన్ రెండింటినీ అడ్డుకుంటుంది.ఇది ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అయినందున.. ఎగువ శ్వాసకోశంలో స్థానిక ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది సంక్రమణ, ప్రసారాన్ని తగ్గించే సామర్థ్యాన్ని అందిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios