Asianet News TeluguAsianet News Telugu

ఎస్సీ ఉపకులాల సంక్షేమానికి ప్రత్యేక కమిటీ వేసిన కేంద్రం.. తెలంగాణలో ప్రతినిధులతో భేటీ

ఎస్సీ ఉపకులాల సంక్షేమానికి పాలనాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పరిశీలించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కార్యదర్శుల కమిటీ ఏర్పాటైంది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఈ కమిటీ ఏర్పడింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులను ఈ కమిటీ కలిసింది.
 

union govt constituted committee of secretaries to look up welfare of sc communities kms
Author
First Published Feb 9, 2024, 7:04 PM IST

న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటా అందడం లేదని ఎస్సీలోని కొన్ని వర్గాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలను అనుసరించి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలో కొందరు కార్యదర్శలతో ఓ కమిటీ వేసింది. ఎస్సీల్లోని మాదిగలు, ఇతర ఉప కులాల అందరికి ప్రయోజనాలు అందాలంటే తీసుకోవాల్సిన పాలనాపరమైన నిర్ణయాలను పరిశీలించడానికి ఈ కమిటీ వేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ కమిటీ రెండో సారి కూడా సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ఎస్సీ సామాజిక వర్గానిక చెందిన ప్రతినిధులను ఈ కమిటీ కలిసింది. కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసినందుకు ఈ ప్రతినిధులు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: CM Revanth Reddy: గూడ అంజన్న చివరి కోరిక కేసీఆర్‌ను చూడాలని..కానీ.. : సీఎం రేవంత్ రెడ్డి

మాదిగలు ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక పరిస్థితులను, ఇతర సమస్యలను ఈ ప్రతినిధులు కమిటీకి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు, అభివృద్ధి పథకాల ఫలాలు మాదిగలకు, ఇతర అలాంటి ఉపకులాలకు సమానంగా అందించేలా విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. సమాజంలోని పలు వర్గాల సంక్షేమాన్ని నిరంతరం ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, వారు లేవనెత్తిన సమస్యలను పరీక్షిస్తామని కమిటీ వారికి భరోసా ఇచ్చినట్టు ఆ వర్గాలు వివరించాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios