2021- 22 బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు జరపడం ఆనవాయితీగా వస్తోంది.

దీనిలో భాగంగా డిసెంబర్‌ 14 నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ వర్గాలు, గ్రూపులతో సమావేశాలు జరపనున్నారు. కరోనా కారణంగా ఈ భేటీలు వర్చువల్‌ రూపంలోనే జరగనున్నాయి. 

ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభకు సమర్పించనున్నారు. దీని కంటే ముందు వివిధ వర్గాలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించడం ఆర్థిక శాఖ సంప్రదాయంగా వస్తోంది.

వీరిలో రైతు సంఘాలు, ఆర్థిక వేత్తలు, పౌరసమాజంలోని వర్గాలు, పారిశ్రామిక వేత్తలతో కేంద్ర మంత్రి భేటీ కానున్నారు. ఈ ప్రీ బడ్జెట్‌ కన్సల్టేషన్స్‌ అనంతరం పన్ను ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకొంటారు. అనంతరం వీటిని ప్రధానితో చర్చించి నిర్ణయిస్తారు.