Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి జ్యోతిరాదిత్య సహా పలువురు నేతలు: ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణ?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం కుదిరిందనే ప్రచారం సాగుతోంది. ఈ నెల 8వ తేదీన మోడీని మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల నుండి కీలక నేతలను ఢిల్లీకి రావాలని బీజేపీ  నాయకత్వం నుండి పిలుపు వచ్చింది. 

Union Cabinet reshuffle may be announced on July 8 lns
Author
Hyderabad, First Published Jul 6, 2021, 3:58 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం కుదిరిందనే ప్రచారం సాగుతోంది. ఈ నెల 8వ తేదీన మోడీని మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల నుండి కీలక నేతలను ఢిల్లీకి రావాలని బీజేపీ  నాయకత్వం నుండి పిలుపు వచ్చింది. దీంతో  జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ బీజేపీ ఎంపీ నారాయణ్ రాణేలు  మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లారు.

కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గహ్లత్ ను కర్ణాటక గవర్నర్ గా నియమించారు. కేంద్ర కేబినెట్ లో కొత్తగా 22 మందికి చోటు కల్పించే అవకాశాలున్నాయి. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది.2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందనే ప్రచారం సాగింది. ఇవాళ ఢిల్లీకి వెళ్లే ముందు  మహంకాళి ఆలయంలో ఆయన  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూకు  కేబినెట్ లో చోటు దక్కనుంది. అయితే రెండు కేబినెట్ బెర్తులు కావాలని జేడీయూ కోరుతోంది. ఎల్‌జేపీకి కూడ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే  చిరాగ్ పాశ్వాన్ కాకుండా  చిరాగ్ నుండి చీలిన వర్గానికి కేబినెట్ లో చోటు దక్కనుందనే ప్రచారం సాగుతోంది.  అప్నాదళ్ కు కూడ మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ లో మార్పులు చేర్పులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఐదు రాష్ట్రాలకు కేబినెట్ లో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios