న్యూఢిల్లీ: బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం సోమవారం నాడు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కొద్దిసేపు ముందు  పార్లమెంట్ లోనే కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 

ఈ సమావేశానికి ముందు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిశారు. బడ్జెట్ ప్రతిని రాష్ట్రపతికి అందించారు. రాష్ట్రపతి భవన్ నుండి ఆమె నేరుగా పార్లమెంట్ కు చేరుకొన్నారు. అక్కడి నుండి ఆమె కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు.

also read:కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం: బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్

కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ బడ్జెట్  కు ఆమోదం తెలిపిన తర్వాత బడ్జెట్ ను  నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులను తన ట్యాబ్ ద్వారా మంత్రి చదివి విన్పిస్తారు.

కరోనా కారణంగా పలు రంగాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ రంగాలను ఆదుకొనేందుకు నిర్మలమ్మ ఏ రకమైన తాయిలాలు ఇస్తారనే విషయమై ఆశగా ఎదురు చూస్తున్నారు.