Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్.. దసరాకు ముందే ఖాతాల్లోకి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో వీరికి బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ.3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. 

Union Cabinet Approves Bonus For Central Employees ksp
Author
New Delhi, First Published Oct 21, 2020, 4:50 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో వీరికి బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది.

బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ.3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

దీని వల్ల పండుగ సీజన్‌లో డిమాండ్ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు బోనస్ ఉద్యోగుల ఖాతాల్లోకి ఒకే వాయిదాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుతుల ఉత్పాదకతతో సంబంధం లేని బోనస్‌ను అందుకోనున్నారు.

కాగా, దుర్గాపూజలోగా సామర్ధ్యం ఆధారిత బోనస్‌ను విడుదల చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెండు ప్రధాన రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios