New Delhi: రాహుల్ గాంధీ పార్ల‌మెంట్ స‌భ్య‌త్వంపై అనర్హత వేటు వేయడంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా చేరింది. కాంగ్రెస్ చీఫ్ ఏర్పాటు చేసిన సమావేశానికి టీఎంసీ ఎంపీలు జవహర్ సిర్కార్, ప్రసూన్ బెనర్జీలు హాజరయ్యారు. 

Oppn Parties Including TMC Hold Meeting: కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్ర‌తిప‌క్షాల స‌మావేశంలో సోమ‌వారం నాడు అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది. గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న తృణ‌మూల్ కాంగ్రెస్ సైతం ఈ స‌మావేశానికి హాజ‌రై అంద‌రినీ ఆశ్చర్యపర్చింది. రాహుల్ గాంధీ పార్ల‌మెంట్ స‌భ్య‌త్వంపై అనర్హత వేటు వేయడంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా చేరింది. కాంగ్రెస్ చీఫ్ ఏర్పాటు చేసిన సమావేశానికి టీఎంసీ ఎంపీలు జవహర్ సిర్కార్, ప్రసూన్ బెనర్జీలు హాజరయ్యారు. అయితే, మ‌మ‌తా బెన‌ర్జీ నాయ‌క‌త్వంలోని టీఎంసీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరంలో ఉంటామని ప్రకటించినప్పటి నుండి తాజా అంశం పెద్ద మార్పును సూచిస్తుందని చెప్ప‌డంలో సందేహం లేదు. 

ప్ర‌తిప‌క్ష నాయ‌కులు న‌ల్ల దూస్తులు ధ‌రించి కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ అన‌ర్హ‌త వేటును వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న తెలిపారు. ప్ర‌తిప‌క్షాల స‌మావేశానికి తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కులు రావ‌డంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖ‌ర్గే స్పందిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ముందుకు సాగే వారిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నదని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. "కాంగ్రెస్ నిర‌స‌న‌ల‌కు మ‌ద్ద‌తు నిచ్చినందుకు నిన్న అందరికీ థ్యాంక్స్ చెప్పాను, ఈ రోజు కూడా థాంక్స్ చెబుతున్నాను. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, ప్రజలను రక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తాం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖ‌ర్గే పేర్కొన్నారు.

Scroll to load tweet…

కాగా, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నల్ల చొక్కాలు ధరించి నిర‌స‌న తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే)తో కలిసి 'నల్ల చొక్కా' నిరసనలో పాల్గొంది. ఈ స‌మావేశంలో కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, జేడీయూ, బీఆర్ఎస్, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ, ఐయూఎంఎల్, ఎండీఎంకే, కేసీ, టీఎంసీ, ఆర్ఎస్పీ, ఆప్,జ‌మ్మూకాశ్మీర్ ఎన్సీ, శివసేన (యూబీటీ)లు పాలుపంచుకున్నాయి.