అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉంటున్నాడని హసీనా పార్కర్ కొడుకు అలీషా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం ఇచ్చాడు.
ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్ Dawood Ibrahim పాకిస్తాన్ లో నివాసం ఉంటున్నట్టుగా హసీనా పార్కర్ కొడుకు Alishah ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు చెప్పారు.తన కుటుంబానికి దావూద్ ఇబ్రహీంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే అండర్ వరల్డ్ డాన్ భార్య మెహజబిన్ పండుగల సమయంలో బంధువులతో ఫోన్ లో మాట్లాడుతుందని అలీషా ఈడీకి చెప్పారు.
అలీషా పార్కర్ తల్లి హసీనా పార్కర్ గృహిణి,. కానీ జీవనం కోసం ఆమె చిన్న చిన్న ఆర్ధిక లావాదేవీలు చేసిందని అలీషా ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. తనకు ఉన్న ఆస్తులను అద్దెకు ఇచ్చి ఆదాయం పొందేదని అలీషా చెప్పారు. వ్యాపారానికి అవసరమయ్యే వారికి రూ. 3 నుండి రూ. 5 లక్షలను అప్పు కోసం ఇచ్చేదన్నారు. దీనికి వడ్డీ తీసుకొనేదని అలీషా వివరించారు.
తన తల్లి హసీనా కూడా రియల్ ఏస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిందని కూడా అలీషా వివరించారు. దావూద్ ఇబ్రహీం చెల్లె అయినందున తన తల్లి ఆస్తి వివాదాలను పరిష్కరించేదని అలీషా ఈడీకి వివరించారు.దావూద్ ఇబ్రహీం 1986లో దేశాన్ని విడిచి వెళ్లి పోయాడని కూడా ఆయన ఈడీకి వివరించారు.
దావూద్ ఇబ్రహీంకి సన్నిహితులను కేంద్ర దర్యాప్తు సంస్థ పట్టుకుంది., దావూద్ ఇబ్రహీం సన్నిహితులకు చెందిన ఆస్తులపై తనిఖీలు చేసింది ఈడీ, ఏక కాలంలో 20కి పైగా ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ నెల 9వ తేదీన ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.20 స్థావరాల్లో షార్ప్ షూటర్స్, స్మగ్లర్లు ఉన్నట్టుగా అధికారులు చెప్పారు. పలువురు నిర్వాహకులపై దాడులు చేశారు. ముంబైలోని నాగిపాడ, గోరేగావ్, బోరెవలి, శాంతాక్రజ్, ముంబరా, బెండి బజార్ లలో దాడులు ప్రారంభమయ్యాయి. దావూద్ తో పాటు చాలా మంది హ్యాండ్ ఓవర్ ఆపరేటర్లు, డ్రగ్స్ స్మగ్లర్లున్నారని ఎన్ఐఏ తెలిపింది.
