Asianet News TeluguAsianet News Telugu

నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి 10 మంది మృతి.. జమ్ము కశ్మీర్‌లో దుర్ఘటన

జమ్ము కశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలింది. రాంబాన్ జిల్లాలో జమ్ము శ్రీనగర్ హైవే దగ్గర ఈ సొరంగం తవ్వుతున్నారు. 15 మీటర్ల ఎత్తు నుంచి ఓ రాయి వచ్చి పడింది. దీని కారణంగా సొరంగం కూలింది.
 

under construction tunnel collapsed in jammu kashmir 10 workers dead
Author
New Delhi, First Published May 20, 2022, 7:41 PM IST

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలింది. రాంబాన్ జిల్లా జమ్ము - శ్రీనగర్ నేషనల్ హైవే కింద ఈ సొరంగాన్ని తవ్వుతున్నారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సొరంగం కూలింది. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దారుణ ప్రమాదాన్ని దర్యాప్తు చేయడానికి నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పది రోజుల్లో నివేదికను సమర్పించనుంది. సొరంగం ఎంట్రెన్స్‌ కోసం నిర్మాణం జరుగుతున్నది. ఇది ఎన్‌హెచ్ స్ట్రెచ్ కిందకు వస్తుంది.

ఈ సొరంగం కోసం తొలిసారిగా గురువారం బ్లాస్ట్ చేశారు. ఇది జారుడు ప్రాంతం. అప్పటికే చాలా వరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, 15 మీటర్ల ఎత్తు నుంచి ఓ రాయి పరుగున వచ్చి కింద పడింది. ఎలాంటి సంకేతాలు లేకుండానే రాయి వచ్చి పడింది. ఈ రాయి కారణంగా ఆ సొరంగం కూలిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios