బెంగళూరులో కూలిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్.. చిన్నారితో సహా తల్లి మృతి..!
బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. బెంగళూరులోని నాగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. బెంగళూరులోని నాగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. నాగ్వారా రింగ్‌రోడ్‌లోని హెచ్‌బీఆర్ లేఅవుట్ సమీపంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న సమయంలో పిల్లర్‌కు బిగించిన రాడ్లు ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అదే దారిలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు, వారి ఇద్దరు చిన్నారులపై పిల్లర్ రాడ్‌లు పడ్డాయి.
దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ తల్లి, కొడుకు మృతిచెందారు. మృతులను తేజస్విని, ఆమె రెండున్నరేళ్ల చిన్నారి విహాన్‌గా గుర్తించారు. తేజస్విని భర్త లోహిత్‌కు, కూతురుకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనపై సమాచారం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇక, సిల్క్ బోర్డ్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మాణంలో ఉన్న మెట్రో మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ లోడ్ వల్లే ఇనుప స్తంభం కూలిపోయిందని చెబుతున్నారు. మెట్రో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.