బీహార్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. వైరల్ అవుతున్న దృశ్యాలు.. (వీడియో)
బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తంగంజ్ వంతెన కూలిపోయింది.

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తంగంజ్ వంతెన కూలిపోయింది. వంతెన కూలిన దృశ్యాన్ని స్థానికులు వీడియో తీశారు. అయితే వంతెన కూలడం ఇది రెండోసారని చెబుతున్నారు. కెమెరాలో చిక్కుకున్న దృశ్యాల ప్రకారం.. నిర్మాణంలో వంతెన రెండు భాగాలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక, బీహార్‌లోని ఖగారియాలో రూ.1,700 కోట్ల వ్యయంతో అగువానీ సుల్తాన్‌గంజ్ వంతెనను నిర్మిస్తున్నారు. గంగా నదిపై ఈ వంతెన నిర్మాణం జరుగుతంది.
ఇక, ఈరోజు ఆదివారం కావడంతో చాలా తక్కువ మంది కార్మికులు ఉండడంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు జరగడం లేదని చెబుతున్నారు. నివేదికల ప్రకారం.. వంతెన కనీసం 3 అడుగుల భాగం దిగువన ఉన్న గంగా నదిలో కూలిపోయింది. గతేడాది ఏప్రిల్‌లో తుఫాను కారణంగా వంతెన కొంత దెబ్బతింది.