కేరళలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి పక్కకు జరిగింది. దీంతో విమానం రెండు ముక్కలైన సంగతి తెలిసిందే. ఈ విమానంలో దాదాపు 191 మంది ప్రయాణిస్తుండగా.. వారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పటి వరకు తెలీదు. ఇప్పటి వరకు 20మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.

అయితే.. ఈ ప్రమాద ఘటన వద్ద ఓ చిన్నారి బిక్కుబిక్కుమంటూ కనిపించింది. సహాయ సిబ్బంది ఘటనా స్థలం నుంచి మూడేళ్ల చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ పాప అమ్మానాన్నలెవరు? వారు సురక్షితంగానే ఉన్నారా? ప్రాణాలకు ముప్పు వాటిల్లిందా? తెలియాల్సి ఉంది. పాపను కొండొట్టి హాస్పిటల్‌కు తరలించినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు తెలిసిన వారు 9048769169 నంబర్‌కు కాల్ చేయవచ్చని సూచించారు. కాగా.. తల్లిదండ్రుల కోసం ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. 

కాగా ఈ విమాన ప్రమాదంలో తీవ్రగాయాలతో విమాన పైలట్ మృతి చెందాడు. పలువురు ప్రయాణికులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 

ప్రమాద విషయం తెలుసుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఇప్పటికే భారీగా అంబులెన్సులు అక్కడికి చేరుకున్నట్లుగా సమాచారం. వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి 191 మంది ప్రయాణికులతో ఈ విమానం కేరళకు వస్తోంది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా, పదుల సంఖ్యలో గాలయాలైనట్లుగా తెలుస్తోంది. భారీ వర్షమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ ప్రకటించింది. ఇంకా వర్షం కురస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.