Asianet News TeluguAsianet News Telugu

వికాస్ దూబే ఎన్కౌంటర్: బీజేపీ ప్రభుత్వం పై ఉమా భారతి ప్రశ్నల వర్షం

ప్రతిపక్షాలు మాత్రమే వికాస్ దూబే ఎన్కౌంటర్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అనుకుంటుంటే.... తాజాగా సొంతపార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఉమాభారతి సైతం ప్రతిపక్షాలతో గింతు కలుపుతున్నట్టుగా ఫైర్ అయ్యారు. వికాస్ దూబే వంటి కిరాతకుడ్ని హత్య చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ కు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆమె శివరాజ్ సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. 

Umabharati Praises Shivraj Government Over Vikas Dubey's Encounter, But Praises Yogi
Author
Bhopal, First Published Jul 11, 2020, 10:06 AM IST

ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే నిన్న ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ ను ఫేక్ ఎన్కౌంటర్ అంటూ పలువురు ప్రశ్నిస్తున్న విషయం కూడా తెలిసిందే. వికాస్ దూబే విషయంలో ఇటు ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ పై, మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

ఇప్పటివరకు ప్రతిపక్షాలు మాత్రమే వికాస్ దూబే ఎన్కౌంటర్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అనుకుంటుంటే.... తాజాగా సొంతపార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఉమాభారతి సైతం ప్రతిపక్షాలతో గింతు కలుపుతున్నట్టుగా ఫైర్ అయ్యారు. వికాస్ దూబే వంటి కిరాతకుడ్ని హత్య చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ కు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆమె శివరాజ్ సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. 

తనకు మూడు అనుమానాలున్నాయని వాటిని సంధించారు ఉమా. 1. వికాస్ దూబే ఉజ్జయిని వరకు ఎలా చేరుకున్నాడు. 2. దేవాలయంలో ఎంతసేపు గడిపాడు? 3. పోలీసులను కాల్చి చంపినా తరువాత టీవీల్లో అతని ఫోటోను పదే పదే చూపిస్తున్నప్పటికీ... అతనిని గుర్తుపట్టడానికి అంత సమయం ఎందుకు పట్టింది అని తన మూడు ప్రశ్నలను సంధించారు. 

ఉమా భారతి ప్రశ్నలతో ఒక్కసారిగా మధయ్ప్రదేశ్ బీజేపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఉమాభారతి రెస్పాన్స్ తో అందరూ కూడా డిఫెన్సె లో పడ్డారు. ఆమె ట్వీట్ల వర్షంతో ఇప్పుడు ప్రభుత్వం ఎలా  స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఇకపోతే.... వికాస్ దూబే ఆస్తుల వివరాలపై విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వికాస్ దూబే తక్కువ కాలంలో కోట్లాదిరూపాయల ఆస్తులు సంపాదించాడని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం అందింది. తక్కువ కాలంలో దూబే ఎలా కోట్లు గడించాడు అన్న దానిపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో దూబేను అరెస్టు చేయగానే, అతనితోపాటు అతని బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

ఆదాయపుపన్నుశాఖ పరిశోధన విభాగం అధికారులు దూబే బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. వికాస్ దూబే సన్నిహిత బంధువుల పేరిట దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు పలు దేశాల్లో  ఆస్తులున్నాయని వెల్లడైంది.దూబే 8 నెలల క్రితం లక్నో నగరంలో రూ.5కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

దీంతోపాటు బ్యాంకాంక్ నగరంలో ఓ హోటల్ లో వికాస్ దూబే పెట్టుబడి పెట్టాడని సమాచారం. వికాస్ దూబేకు 12 ఇళ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దూబే సన్నిహితడి పేరిట ఆర్యనగర్ లో 28 కోట్ల ఆస్తులున్నాయని తేలింది. ఆర్యనగర్ లో దూబే సన్నిహితుడి పేరిట 8 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ 5కోట్లరూపాయలుంటుందని తేల్చారు. 

కాన్పూర్ నగరంలోని పంకీ ప్రాంతంలో దూబేకు డూప్లెక్స్ బంగళా ఉంది. దీనివిలువ రూ.2కోట్లు అని పోలీసులు చెప్పారు. ఐటీ అధికారులు దూబేతోపాటు అతని బంధువులు, సన్నిహిత అనుచరుల పేరిట ఉన్న ఆస్తుల గురించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios