Asianet News TeluguAsianet News Telugu

'నేను హిందువునైనందుకు గర్విస్తున్నా': రిషి సునక్

జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ న్యూఢిల్లీ చేరుకున్నారు. రిషి సునక్ మాట్లాడుతూ తాను హిందువునైనందుకు గర్విస్తున్నాననీ,తాను  కూడా అలాగే పెరిగాననీ అన్నారు. FTA, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

 

UK PM Rishi Sunak says calls himself proud Hindu KRJ
Author
First Published Sep 9, 2023, 3:56 AM IST

జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారత రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. కాగా, శనివారం నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌కు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  భారతదేశంతో సంబంధాలు, FTA, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా అనేక అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ భారత్ ను  ప్రశంసించారు  G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సరైన సమయంలో ఇది సరైన దేశమని అన్నారు. ఇంటర్వ్యూలో తనను తాను హిందువుగా గర్విస్తున్నానని అన్నారు.భారతదేశ పర్యటన సందర్భంగా ఒక ఆలయాన్ని సందర్శించడం గురించి మాట్లాడాడు.

అంతకుముందు జీ20 సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య అక్షతా మూర్తితో ఇండియాకు చేరుకున్నారు. న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే దంపతులకు స్వాగతం పలికారు. 

'నేను హిందువునైనందుకు గర్విస్తున్నాను'

రిషి సునక్ మాట్లాడుతూ తాను  గర్వించదగిన హిందువునని, తాను  హిందూ సంప్రాదయం మధ్యనే పెరిగానని. తాను రక్షా బంధన్ పండుగను కూడా జరుపుకున్నానని తెలిపారు. రక్షా బంధన్ రోజు తన అక్కాచెల్లెళ్లు రాఖీ కడుతారని అన్నారు. మొన్నటికి మొన్న జన్మాష్టమిని సక్రమంగా జరుపుకునే సమయం లేకున్నా.. గుడి దర్శనం చేసుకుంటే సరిపెట్టుకుంటాననీ అన్నారు. విశ్వాసం అటువంటి విషయం అని తాను  నమ్ముతున్నాననీ, ఇది తన జీవితంలో విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడుతుందని అన్నారు.

ఉచిత వాణిజ్య ఒప్పందం

ఇదిలావుండగా.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థితిలో ఉన్నాయని, ప్రధాని మోదీతో తన  సంబంధాలను మరింత లోతుగా, విస్తృతం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నామని రిషి సునక్ అన్నారు. భారత్‌తో కొనసాగుతున్న ఎఫ్‌టిఎ గురించి రిషి సునక్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సమగ్రమైన, ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం పూర్తయ్యేలా చూడాలని ప్రధాని మోడీ, తాను ఆసక్తిగా ఉన్నామని అన్నారు. తామిద్దరం మంచి ఒప్పందం జరగాలని నమ్ముతున్నామనీ, కానీ వాణిజ్య ఒప్పందాలు ఎల్లప్పుడూ సమయం తీసుకుంటాయని అన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి గురించి రిషి సునక్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సమస్యలపై భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో చెప్పడం తన పని కాదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios