UK PM Race Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ వారసుడిగా.. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్ ప్రధాని రేసులో నిలిచారు. తొలి రౌండ్ లో ఆయన టాప్ లో నిలిచారు. ఆయనకు తొలి రౌండ్‌లో 88 ఓట్లు లభించాయి.
UK PM Race Rishi Sunak: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వారసుడిగా.. అధికార కన్జర్వేటివ్ పార్టీ లీడర్ గా భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో నిలిచాడు. బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రేసులో భాగంగా.. తొలి రౌండ్ ఓటింగ్‌లో రిషి సునాక్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. రిషి సునక్ 88 ఓట్లు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం సునక్‌తో పాటు మరో ఐదుగురు ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ స్థానంలో బ్రిటన్ కొత్త ప్రధానిని పాలక కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా నియమించనున్నారు.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, సునాక్‌తో పాటు, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డెంట్, మాజీ క్యాబినెట్ మంత్రి కెమీ బద్నోక్, ఎంపీ టామ్ తుగెన్‌ధాట్ మరియు బ్రిటిష్ క్యాబినెట్ అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్‌మాన్ రేసులో ఉన్నారు.
ఎవరికి ఎన్ని ఓట్లు?
తొలి దశ ఓటింగ్‌లో రిషి సునక్ 88 ఓట్లు రాగా.. పెన్నీకి 67 ఓట్లు, లిజ్‌కి 50 ఓట్లు, కెమీకి 40 ఓట్లు, టామ్ టుగెండాట్‌కు 37 ఓట్లు, సుయెల్లా బ్రవర్‌మన్‌కు 32 ఓట్లు వచ్చాయి. తొలిదశ ఓటింగ్ తర్వాత తొలి రౌండ్ ఓటింగ్‌లో మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఇందులో నూతన ఆర్థిక మంత్రి నధిమ్ జాహవికి 25 ఓట్లు రాగా, జెరెమీ హంట్‌కు 18 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ప్రధాని రేసుకు దూరమయ్యారు.
రెండో రౌండ్‌కు వెళ్లాలంటే.. కనీసం 30 మంది ఎంపీల మద్దతు పొందాలి. పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీకి 358 మంది సభ్యులున్నారు. ఇందులో 88 మంది ఎంపీలు సునక్‌కు ఓటు వేశారు. గురువారం రెండో విడత పోలింగ్ అనంతరం.. చివరి ఇద్దరు అభ్యర్థులను దశలవారీగా ఎన్నుకోనున్నారు. ఫైనల్ గా బ్రిటన్ నూతన ప్రధానిని సెప్టెంబర్ 5న ఎన్నుకోనున్నారు.
ఇక తరువాత రౌండ్లలో తక్కువ ఓట్లు పొందిన వారిని పోటీ నుంచి తప్పిస్తారు. ఇలా చివరకు అత్యధిక ఓట్లు వచ్చిన ఇద్దరిని బరిలో దించుతారు. ఈ ఇద్దరు అభ్యర్థుల్లో.. కన్జర్వేటివ్ పార్టీ నేతగా.. మరోకరిని ప్రధానిగా.. అధికార పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటున్నారు. ఆ ఓట్లలో అధిక మెజారిటీ లభించిన వారిని ప్రధానిగా ప్రకటించారు. ప్రస్తుత జరుగుతున్న పోటీని పరిశీలిస్తే.. బ్రిటన్ ప్రధాని పదవికి త్రిముఖ పోటీ ఏర్పడనున్నది. ఇందులో ప్రధానంగా రిసి సునాక్‌తోపాటు మోర్డౌంట్, ట్రస్ ల మధ్య పోటీ జరుగునున్నది.
బోరిస్ జాన్సన్ రాజీనామా
మంత్రుల రాజీనామా తర్వాత ఒత్తిడి పెరగడంతో బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీని తరువాత, సునక్ తన ప్రచారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, "నా నాయకత్వం నుండి పార్టీకి, దేశానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే దానిపై దృష్టి సారించి..తాను సానుకూల ప్రచారాన్ని నడుపుతున్నానని అన్నారు.
