వైద్య వృత్తిలో ఉండి రోగుల ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు.. ఆస్పత్రిలో రాసలీలు నెరిపాడు. తన కింద పనిచేసే నర్స్ ని ఆపరేషన్ థియేటర్ లో ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న వైద్యుడు ఆపరేషన్ థియేటర్ లో నర్స్ తో రొమాన్స్ చేశాడు. అతను ఆమెను ముద్దుపెట్టుకుంటుండగా.. ఆస్పత్రిలోని సిబ్బంది ఎవరో వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోని వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేశారు.

కాగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ శశాంక్ మిశ్రా దాకా వెళ్లడంతో.. ఆయన వెంటనే దీనిపై స్పందించారు. ఆ వైద్యుడిని విధుల నుంచి తొలగించడంతోపాటు.. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సింది ఆ డాక్టర్ కి నోటీసులు జారీ చేశారు.

ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి మోహన్ మాల్వియా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వీడియో ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.