Ugadi 2022: ష‌డ్రుచుల స‌మ్మేళ‌నం.. ఉగాది ప‌చ్చ‌డి. పండ‌గ రోజు త‌యారు చేసుకుని ఈ ఆరు విభిన్న రుచుల స‌మ్మేళ‌నం.. మ‌న జీవితంలోని అభిరుచుల ప్రాముఖ్యతను - మన జీవితంలో భావోద్వేగాలతో ముడిప‌డి ఉంటుంది.   

Ugadi Pachadi :  మొద‌ట‌గా అంద‌రికీ తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండ‌గ శుభాకాంక్ష‌లు..!  దేశంలోని చాలా ప్రాంతాల్లో జ‌రుపుకునే ముఖ్య‌మైన పండ‌గ‌ల‌లో ఉగాది ఒక‌టి. ఇది తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం. ప్రజలు కొత్త బట్టలు కొనుక్కుని మామిడి ఆకులతో తమ ముఖద్వారాన్ని అలంకరించుకుంటారు. ప్రజలు తమ ఇళ్ల వెలుపల రంగురంగుల రంగోలి డిజైన్లను  వేస్తారు. ఉగాది పచ్చడి తప్పనిసరిగా తెలుగు కొత్త సంవత్సరం రోజు ప్ర‌త్యేకం. పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి తెలియ‌జేస్తాయి. ఉగాది పచ్చడి రుచి తీపి మరియు పులుపు రెండింటిలోనూ ఉంటుంది. ఉగాది ప‌చ్చ‌డిలో ఉప‌యోగించే పచ్చి మామిడి, చింతపండు, బెల్లం, వేప పువ్వుల వంటి తీపి పదార్థాలతో తయారు చేస్తారు. ప‌చ్చ‌డిలో ఉప‌యోగించే ఈ ప‌ద‌ర్థాలు మ‌న జీవితంలోని అనేక విష‌యాల‌తో ముడిప‌డి ఉంటాయి. 

ఉగాది పచ్చడి.. మ‌న జీవితంలోని 6 వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంది.

బెల్లం : తీపిని కలిగించేది. ఆనందానికి గుర్తు. ఇది మ‌నసును ఆహ్లాద పరుస్తుంది. బెల్లంలో మినరల్స్‌, విటమిన్స్‌, పొటాషియంలు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే, బెల్లంలో ఉండే ఐరన్‌ రక్తహీనత రాకుండా కాపాడుతుంది.

చింతపండు : పులుపుగా ఉంటుంది. ఇది నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు గుర్తు చేస్తుంది. ఇందులో ఉండే ఔష‌ధ గుణాలు జీర్ణశక్తిని మెరుగు ప‌రుస్తాయి.

ఉప్పు : రుచిని క‌లిగించే ప‌దార్థం. ఇది జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. దీని వ‌ల్ల శ‌రీరానికి అనేక లాభాలు క‌లుగుతాయి.

కారం : సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు తెలియ‌జేస్తుంది. ఇక కారంలో ఉండే ఫైబర్స్‌, మినరల్స్‌, విటమిన్స్ వ‌ల్ల శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. ఆస్తమా, దగ్గు, శ్వాస సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది.

వేప పువ్వు : చేదును కలిగించేది. జీవితంలో బాధకలిగించే అనుభవాలకు గుర్తు చేసేది. వేపపువ్వు వ‌ల్ల పొట్టలో ఉండే హానికర క్రిములను చంప‌డంతో పాటు చ‌ర్మ వ్యాధులు రానీయ‌దు. రక్తశుద్ధికి తోడ్ప‌డుతుంది.

మామిడి : లేత పచ్చి మామిడి వగరుగా ఉంటుంది. ఇది జీవితంలో వ‌చ్చే కొత్త సవాళ్లును ఎదుర్కొవాల‌ని సూచిస్తుంది. మామిడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల పేగుల్లోని మలినాల్ని బయటకు పంపుతుంది. రక్త విరేచనాలను అరికడుతుంది.


ఉగాది ప‌చ్చ‌డి ఎలా త‌యారు చేసుకోవాలంటే..

కావలసిన ప‌దార్థాలు – త‌గిన మోతాదులో తీసుకోవాలి.

1. వేప‌ పువ్వు

2. చింతపండు

3. బెల్లం

4. పచ్చి మామిడి

5. ఉప్పు

6. కారం (లేదా పచ్చిమిర్చి)

7. శెనగపప్పు

8. తాజా కొబ్బరి తురుము

9. అరటి కాయ ముక్కలు

త‌యారు చేసుకోవ‌డం ఇలా….
చింతపండు గుజ్జు, బెల్లం తురుము, మామిడి ముక్కలు, కొబ్బరి తురుము, వేపపువ్వు, శెనగపప్పు, ఉప్పు, కారం లేదా పచ్చిమిర్చి, అరటికాయ ముక్కలు ఒక గిన్నెలో వేసి కలపాలి. ఉగాది ప‌చ్చ‌డి రెడీ ..! అయితే.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు వేరు వేరు పద్దతుల్లో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. అయితే, ఉపయోగించే పదర్థాలు మాత్రం పైన చెప్పినవే ఉంటాయి.