దేశంలో వారసత్వ రాజకీయాలు కొత్తకాదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ లిస్టులో ఎన్నో పార్టీలు, ఎంతోమంది నాయకులు కనిపిస్తారు. తాజాగా తమిళనాట బలమైన డీఎంకేలో వారసుడు ఎంట్రీ ఇచ్చాడు.

తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా నియమించాలని ఆ  పార్టీ అధినేత స్టాలిన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనపప్పటికీ.. ఈ కుర్రాడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.

అంతేకాకుండా ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో  పార్టీ తరుపున ప్రచారం కూడా నిర్వహించారు. స్టాలిన్ నిర్ణయం ద్వారా తన తర్వాత పార్టీ అధినేత ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు.

డీఎంకే యూత్  వింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించేందుకు ఉదయనిధికి అన్ని అర్హతలు ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.