Asianet News TeluguAsianet News Telugu

అనంత్‌నాగ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ప్రాణాలు కోల్పోయిన సామాన్య పౌరుడు 

ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు విజయవంతమవడంతో పాకిస్థాన్‌తో పాటు ఉగ్రవాద సంస్థలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో అనంత్‌నాగ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. ఉదంపూర్‌కు చెందిన ఒక పౌరుడిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్చిచంపారని పోలీసు అధికారి తెలిపారు. ఇందులో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

Udhampur Resident Shot Dead By Terrorists In Anantnag, Security Forces Cordoned Off KRJ
Author
First Published May 30, 2023, 3:33 AM IST

G20 విజయంతో కోపోద్రిక్తులైన ఉగ్రవాదులు సోమవారం రాత్రి జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో దారుణానికి పాల్పడ్డారు. జిల్లాలోని ఉదంపూర్‌కు చెందిన ఒక పౌరుడిని లక్ష్యంగా చేసుకుని హతమార్చారు. అనంత్‌నాగ్‌లోని జంగ్లాత్ మండి సమీపంలోని అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోని సర్కస్ ఫెయిర్‌లో పనిచేసేవాడు. ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉధంపూర్‌కు చెందిన దీపును ఉగ్రవాదులు కాల్చిచంపారు. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను ఒక ప్రైవేట్ సెక్టార్ సర్కస్ ఫెయిర్‌లో పనిచేసేవాడు. ఉగ్రవాదులు రాత్రి అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు చేరుకుని టెంట్‌లో నిద్రిస్తున్న దీపును లక్ష్యంగా చేసుకుని కాల్చిచంపినట్లు సమాచారం.


కాల్పుల శబ్దం విని అక్కడ నివసిస్తున్న ఇతర ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా రక్తపు మడుగులో దీపు పడి ఉన్నాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఓజీ అధికారులు ఘటనపై ఆరా తీశారు.

ఈ ఘటనలో ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారో.. కాలినడకన లేదా వాహనంలో వచ్చారో నిర్ధారించలేకపోయారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను కనుక్కుంటామని ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు భద్రతా సిబ్బంది.

ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు విజయవంతమవడంతో పాకిస్థాన్‌తో పాటు ఉగ్రవాద సంస్థలు మండిపడుతున్నాయి. భారత్ పై అసత్య ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ యావత్ ప్రపంచం ముందుకు పూర్తిగా ఒంటరిగా మారింది. ఈ ఉన్మాదంలో సరిహద్దు ఆవల నుంచి వచ్చిన సూచనల మేరకే టార్గెట్ కిల్లింగ్ జరిగిందని భావిస్తున్నారు.

పూంచ్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ 

ఆదివారం రాత్రి జిల్లాలోని ఓల్డ్ పూంచ్ ప్రాంతంలోని మూడు సైనిక స్థాపనల సమీపంలో ముగ్గురు అనుమానితులను గుర్తించడంతో భద్రతా దళాలు సోమవారం కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, సీఆర్పీఎఫ్ సహాయంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఇంటింటికి సోదాలు చేశారని, ప్రస్తుతం అనుమానాస్పద వ్యక్తి కనిపించలేదని అధికారులు తెలిపారు.

పక్షం రోజుల్లో అనుమానితులు కనిపించడం ఇది రెండోసారి అని స్థానికులు పేర్కొంటున్నారు. జనవరి నుండి మూడు వేర్వేరు ఉగ్రదాడులు 10 మంది సైనికులు , ఏడుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పూంచ్ , పరిసర ప్రాంతాలు రాజౌరి జిల్లాలో భద్రత చాలా అప్రమత్తంగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios