Asianet News TeluguAsianet News Telugu

నెల క్రితమే ఏక్‌నాథ్‌కి సీఎం పదవి ఆఫర్ చేశాం .. అయినా ఇలా : ఆదిత్య థాక్రే వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన యువజన విభాగంతో మంత్రి ఆదిత్య థాక్రే భేటీ అయ్యారు. నిజమైన టైగర్లలా వుందామన్న ఆయన.. గౌహతి హోటల్‌లో రెబల్ ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. 

Uddhav Thackeray offered CM post to Eknath Shinde month before says Aditya Thackeray
Author
Mumbai, First Published Jun 26, 2022, 7:22 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు గంట గంటకూ మారిపోతున్నాయి. దీనిలో భాగంగా శివసేన భవన్‌లో పార్టీ యువజన విభాగంతో మంత్రి ఆదిత్య థాక్రే (aditya thackeray) భేటీ అయ్యారు. మనం నిజమైన టైగర్లలా వుండాలని.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏక్‌నాథ్ షిండే ముంబైలో వుండే దమ్ము లేక సూరత్‌ పారిపోయాడని ఆదిత్య విమర్శించారు. గౌహతి హోటల్‌లో రెబల్ ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

బీజేపీ.. శివసేన అంతర్గత వ్యవహారమని చెబుతూనే తమ రెబల్ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఎందుకు కల్పిస్తోందని ఆదిత్య థాక్రే ప్రశ్నించారు. మే 30నే షిండేకు సీఎం పదవిని ఆఫర్ చేశామని.. రెబల్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు. భద్రత కల్పించాల్సింది రెబల్ ఎమ్మెల్యేలకు కాదని.. కాశ్మీరీ పండిట్లకని ఆదిత్య చురకలు వేశారు. మరోవైపు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎమ్మెల్యే రవి రాణా భేటీ అయ్యారు. ఏక్‌నాథ్ షిండేకు మద్ధతుగా ముంబైలో భారీ ప్రదర్శన చేశారు. 

ALso Read:మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం: కోర్టుకు వెళ్లే యోచనలో ఏక్‌నాథ్ షిండే వర్గం

మరోవైపు.. Shiv Sena పార్టీ శాసనసభ పక్షనేతగా తనను తొలగించడంపై Eknath Shinde ముంబై కోర్టును ఆశ్రయించే అవకాశం  ఉంది.  శివసేన శాసనసభ పక్ష నేతగా షిండేను తొలగిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ అభిప్రాయాన్ని కోరిన తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం  Mumbai Court ను ఆశ్రయించనున్నట్టుగా జాతీయ మీడియా సంస్థ కథనాలు ప్రసారం చేసింది. తాము సమాధానం ఇవ్వడానికి డిప్యూటీ స్పీకర్ కనీసం ఏడు రోజుల సమయం ఇస్తే బాగుండేదని రెబెల్ వర్గం చెబుతోంది. 

మరో వైపు రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ముంబైలో ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ముంబై పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు శివసైనికులు. శివసేన పుణె సిటీ అధ్యక్షుడు గజానన్.. శివసేన రెబెల్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నిరసనలు దేశద్రోహులైన శివ సైనికులు క్షమించరనే సందేశాన్ని ఇవ్వడానికి ఉద్దేశించాయన్నారు. అటు శివసేన రెబెల్స్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కేటాయించింది. 15 మంది Rebel ఎమ్మెల్యేల ఆస్తులపై  శివసైనికులు దాడికి దిగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios