Asianet News TeluguAsianet News Telugu

Maharashtra: మాట త‌ప్పారు.. అప్పుడే ఇలా చేసి ఉంటే.. మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌స్త‌వన ఉండేదా?: ఉద్ద‌వ్

Maharashtra:మ‌హారాష్ట్ర‌లో నూత‌న ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించిన బీజేపీ పై శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2019లో ఎందుకు మాట తప్పిందని ప్ర‌శ్నించారు.  అప్పుడే.. ఇలా చేసి ఉంటే.. మహా వికాస్ అఘాడీ ప్ర‌స్తావ‌న  ఉండేది కాదని  అన్నారు 

Uddhav says Had BJP agreed to 2.5 years of Sena CM, there would never have been MVA: 
Author
Hyderabad, First Published Jul 2, 2022, 4:50 AM IST

Maharashtra: మ‌హారాష్ట్ర రాజ‌కీయం చాలా ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతోంది. తాజాగా శివ‌సేన అధినేత‌ ఉద్ద‌వ్ ఠాక్రే బీజేపీ పై సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. సీఎం షిండే ‘శివసేన సీఎం’ కాదని, పార్టీని మోసం చేసిన వాళ్లు శివసైనికులు కార‌ని అన్నారు. రెండున్న‌రేండ్ల కింద తమను మోసం చేసిన పార్టీ శివసేనను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఏక్‌నాథ్‌ షిండేను ‘శివసేన సీఎం’ అని పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నదని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు.  సీఎంగా రాజీనామా చేసిన త‌రువాత ఉద్ద‌వ్ తొలిసారిగా శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 
 
ముఖ్యమంత్రిగా నియమితులైన షిండే, డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్‌ల ప్రమాణస్వీకారం చేయడం గురించి ఆయ‌న‌ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పదవి తీసుకొని బీజేపీ ఏం సాధించాల‌ని భావిస్తుందని ప్రశ్నించారు. శివసేన కార్య‌క‌ర్త‌కు  సీఎం ప‌దవీ ఇచ్చామని చెప్పుకొంటున్న బీజేపీ.. 2019లో ఎందుకు మాట తప్పిందని ప్ర‌శ్నించారు. వారు ఇంతకుముందు ఇలా చేసి ఉంటే, మహా వికాస్ అఘాడీ ప్ర‌స్తావ‌న  ఉండేది కాదని  అన్నారు 

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. 

రాష్ట్రంలో జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీలు విడిపోయాయి, ఐదేళ్ల కాలంలో రెండు పార్టీలకు ఒక్కొక్కరు 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు, రెండో వారు అంగీకరించలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యర్థి ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన పొత్తు కుదుర్చుకుంది.

గ‌త వారం రోజులుగా.. శివ‌సేన‌పై తిరుగుబాటు ప్ర‌క‌టించిన షిండేను శివసేన నాయకత్వ పదవి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. "ప్రభుత్వం ఏర్పాటైన విధానం, శివసేన కార్యకర్త అని పిలవబడే వ్యక్తిని సీఎం చేయడం, నేను అమిత్ షాతో అదే చెప్పాను. ఇది గౌరవప్రదంగా చేయగలిగింది. శివసేన అధికారికంగా మీ వెంట ఉంది (ఆ సమయంలో). నూత‌నంగా ఎన్నుకోబ‌డిన ఏక్‌నాథ్ షిండే..  శివసేన సిఎం కాదని థాకరే అన్నారు.

ఈ క్ర‌మంలో నూత‌న ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పు బ‌ట్టారు. ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్‌ను నిర్మించాలనే నిర్ణయానికి వ్య‌తిరేఖించారు. నూత‌న‌ ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. త‌న మీద ఉంటే.. త‌న మీద మాత్ర‌మే ఉంచాల‌ని, అంతేగానీ.. ముంబైవాసులపై కోపాన్ని పెంచుకోవద్దని ఠాక్రే కోరారు. ముంబైవాసులపై త‌న మీద ఉన్న‌ కోపాన్ని ప్రదర్శించవద్దనీ, మెట్రో షెడ్ ప్రతిపాదనను మార్చవద్దని, ముంబై పర్యావరణాన్ని నాశ‌నం చేయ‌వ‌ద్ద‌ని ఆయన అన్నారు.

 
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ మెట్రో కోసం కార్ షెడ్ నిర్మించేందుకు ఆరే కాలనీలో 2,700 చెట్లను నరికివేయాలని తన ప్రణాళికను ప్రకటించింది. 13,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ కాలనీలో 27కి పైగా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వివిధ జంతు జాతులు నివసిస్తున్నాయి. సెప్టెంబరు 2019లో బాంబే హైకోర్టు, మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం ఆరే అటవీ ప్రాంతంలో చెట్లను నరకవద్దని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL),  రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది. 

తర్వాత అక్టోబర్ 2019లో, ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్‌ను నిర్మించేందుకు 2,500 చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేసింది. అయితే, ఆరే మెట్రో కారు ఆర్డర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం స్టే విధించింది. నగరంలో భారీ ప్రజాందోళనల నేపథ్యంలో షెడ్ ప్రాజెక్టు ఆగిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios