Asianet News TeluguAsianet News Telugu

ఉద్ధవ్ ఠాక్రే వర్గం కోరుకున్న గుర్తులివే...

శివసేనకు భార‌త ఎన్నిక సంఘం(ఈసీ) ఊహించ‌ని షాకిచ్చిన విష‌యం తెలిసిందే. శివ‌సేన‌ పార్టీ పేరు, చిహ్నాన్ని ఇరువ‌ర్గాలు ఉప‌యోగించ‌కూడ‌ద‌ని  ఆదేశించిన‌ నేప‌థ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ‌ర్గం శూల్, జ్యోతి, ఉదయించే సూర్యుడు ల‌ను గుర్తుగా కేటాయించాల‌ని ఎన్నికల కమిషన్‌కు మూడు ఎంపికలు ఇచ్చింది. 
 

Uddhav led Shiv Sena suggests three poll symbols after EC order
Author
First Published Oct 9, 2022, 5:44 PM IST

ముంబైలోని అంధేరీ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.. శివ‌సేన‌ పార్టీ గుర్తు విషయంలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని వర్గాలకు శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును వాడుకోకుండా స్తంభింపజేసింది. ఈ క్ర‌మంలో రెండు వర్గాలు వారిని సోమవారం వరకు మూడు పేర్లు, గుర్తులను సూచించాలని ఎన్నిక‌ల ఆదేశించింది.

ఈ నేప‌థ్యంతో ఉద్ధవ్ థాకరే వర్గం మూడు పేర్లు, గుర్తులతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చినట్టు ఈసీ వర్గాల సమాచారం. గుర్తు ప‌రంగా.. మొదటి ఎంపిక‌గా త్రిశూలం,  రెండో ఎంపిక‌గా ఉదయించే సూర్యుడు, మూడో ఎంపిక‌గా జ్యోతి  గుర్తును ఇచ్చింది. అలాగే.. పార్టీ పేరు పరంగా మొదటి ఎంపిక‌గా 'శివసేన బాలాసాహెబ్ థాకరే', రెండో ఎంపిక‌గా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే' పేర్లను  ఇవ్వాల‌ని ఉద్ధవ్ థాకరే వర్గం ప్రతిపాదించిన‌ట్టు తెలుస్తోంది.
.  
శివసేనకు ఎన్నిక‌ల సంఘం 1989లో శాశ్వత  గుర్తుగా 'విల్లు-బాణం' కేటాయించింది. అంత‌కు ముందు జరిగిన ఎన్నికల్లో కత్తి-డాలు, కొబ్బరి చొట్టు, రైల్వే ఇంజన్, కప్ అండ్  స‌ర‌ర్ గుర్తులతో శివసేన ఎన్నిక‌ల్లో పోటీ  చేసింది. 

కాగా, శివసేన పేరు, విల్లు-బాణం గుర్తు తమవేనంటూ ఇటు ఉద్ధవ్ థాకరే వర్గం, అటు ఏక్‌నాథ్ షిండే వర్గం పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో శనివారం నాలుగు గంటలపాటు జరిగిన సమావేశం అనంతరం శివసేన గుర్తును నిలిపివేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇరువర్గాలు కూడా శివసేన పేరును ఉపయోగించకుండా నిషేధం విధించారు. దీంతో ఇప్పుడు రెండు వర్గాలు కొత్త పేరును, కొత్త ఎన్నికల గుర్తును ఎంచుకోవాల్సి వచ్చింది. కొత్త పేరు మరియు చిహ్నాల కోసం మూడు ప్రత్యామ్నాయాలను సమర్పించాలని అక్టోబర్ 10న కమిషన్ ఆదేశించింది.

ఇదిలాఉంటే.. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ ఠాక్రే తన ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్టోబరు 10న చిహ్నాలు సమర్పించాలి వాస్తవానికి, అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు తమ తమ ఎన్నికల గుర్తులను కమిషన్‌లో సమర్పించాలని ఎన్నికల సంఘం షిండే, ఠాక్రే వర్గాలకు తెలిపింది. రెండు పార్టీలు ప్రాధాన్యత ఆధారంగా ఉచిత చిహ్నాల నుండి తమ ఎంపిక చేసుకోగలుగుతాయి. కావాలంటే ఇద్దరూ ఆర్మీ అనే పదాన్ని తమ పేర్లతో ఉపయోగించుకోవచ్చని కమిషన్ తన డిక్రీలో ఇరు వర్గాలకు ఈ మినహాయింపు ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios