Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ?

ద్రవిడ మున్నేట్ర కజగం నాయకుడు, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రానికి కాబోయే ఉప ముఖ్యమంత్రి అనే ప్రచారం తమిళనాడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

Udayanidhi Stalin as Deputy Chief Minister of Tamil Nadu? - bsb
Author
First Published Jan 9, 2024, 2:18 PM IST

చెన్నై : తమిళనాడులో మరో రాజకీయ పరిణామానికి తెరలేవనుంది. నటుడు, డీఎంకే నాయకుడు, క్రీడా మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ త్వరలో ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారట. ఈ ప్రచారం తమిళరాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కారణం ఏంటంటే.. డిఎంకె అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారట. ఇదే ఉదయనిధి స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం అయ్యే సూచన అని పార్టీలోని వర్గాలు తెలిపాయని ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. 

జనవరి 21న సేలంలో జరగనున్న డీఎంకే యూత్ వింగ్ సమావేశం తర్వాత ఈ పదవి స్టాలిన్ ను వరించనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, డిఎంకె ఆర్గనైజేషనల్ సెక్రటరీ టికెఎస్ ఎలంగోవన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ నియామకంపై తనకు అవగాహన లేదని, అయితే పార్టీలో ఆయన చురుకైన భాగస్వామ్యం ఉందని అన్నారు. తుది నిర్ణయం డిఎంకె చీఫ్‌దేనని పేర్కొంటూ, ఇలంగోవన్ ఇలా అన్నారు, “అతను చాలా చురుకుగా ఉంటాడు కాబట్టి ఇందులో తప్పు లేదు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ముఖ్యమంత్రి మాత్రమే నిర్ణయిస్తారు, ఇతరులు కాదు” అని ఇండియా టుడేకు తెలిపారట. 

భక్తిని చూపించండి.. అనవసర ప్రకటనలు చేయొద్దు - బీజేపీ నేతలకు ప్రధాని సూచన

దీనిమీద ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఇదంతా వట్టి “పుకారు” అని కొట్టి పారేశారు. ఏ విషయం “ముఖ్యమంత్రి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇది పుకారు మాత్రమే' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మరోవైపు, ఉదయనిధి స్టాలిన్ ఉపముఖ్యమంత్రి కావడాన్ని పుకారుగా కొట్టిపారేయలేమని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) స్పందించింది.

‘‘గత ఏడాది నుంచి ఇదే చెబుతున్నాం. ఆయన (ఉదయనిధి) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత మంత్రిగా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2026లో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని, ప్రజాస్వామ్యం పేరుతో పరివార్‌వాదానికి డీఎంకే సరైన ఉదాహరణ అని ఇది తెలియజేస్తోందని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ అన్నారు.

'గత ఏడాది నుంచి ఇదే చెబుతున్నాం. ఆయనకు (ఉదయనిధికి) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్‌ ఇచ్చినప్పటి నుంచి.. ఆ తర్వాత మంత్రిగా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యి.. 2026లో సీఎం అవుతారు. ప్రజాస్వామ్యం పేరుతో పరివార్‌వాదానికి డీఎంకే సరైన ఉదాహరణ అని ఇది తెలియజేస్తోంది’’ అని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ అన్నారు.

"తండ్రి, కొడుకు, మనవడు, ముని మనవడు మాత్రమే పార్టీని నడిపించగల సామర్థ్యం కలిగినవారు. ఇది డిఎంకెలో ప్రజాస్వామ్యం లేమిని చూపిస్తుంది, కానీ ఎఐఎడిఎంకెలో అలా కాదు. ఇక్కడ కిందిస్థాయి కార్యకర్త కూడా పార్టీ అధినేతగా మారగలడు" అని సత్యన్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios