Asianet News TeluguAsianet News Telugu

ఉదయ్ పూర్ ఘటనకంటే వారం ముందే.. మహారాష్ట్రలో మరో ఘటన..? అనుమానంతో దర్యాప్తు ముమ్మరం..

ఉదయ్ పూర్ లో టైలర్ హత్యకు దాదాపు వారం ముందు మహారాష్ట్రలో జరిగిన ఓ వ్యాపారి హత్య ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. టైలర్ లాగానే ఈ వ్యాపారిని కూడా గొంతుకోసి చంపేశారు.

Udaipur Tailor Murder : Mystery Over Similar Murder on Maharashtra Bussiness Man a Week Ago.. Questions Raises
Author
Hyderabad, First Published Jul 1, 2022, 7:38 AM IST

ముంబై : రాజస్థాన్ ఉదయపూర్ లో టైలర్  కన్హయ్యలాల్  హత్య ఉదంతంలో ఉగ్ర కోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీంతో   నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాద సంస్థలతో నిందితులకు సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతోపాటు మరికొన్ని కీలక అంశాలు సైతం రాజస్థాన్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు ముందే మహారాష్ట్రలో దాదాపుగా ఇలాంటి  తరహాలోనే జరిగిన ఓ ఘటనపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో దర్యాప్తు ఊపందుకుంది.

మహారాష్ట్రలోని అమరావతిలో మెడికల్ సామాగ్రి అమ్మే వ్యాపారి ఉమేష్ కోల్హే. ఇతను హత్యకు గురయ్యాడు. ఈ హత్య ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. అతడిని కూడా టైలర్ కన్హయ్యలాల్   లాగానే దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇతర వివరాలు బయటికి పొక్కనివ్వడం లేదు. అయితే, స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు మాత్రం..   ఈ హత్య కూడా nupur sharma  కామెంట్ తో ముడిపడి ఉన్న ఘటనే  అని  చెబుతున్నారు.

జూన్ 21వ తేదీన రాత్రి  దుకాణం నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఉమేష్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ టైంలో బైక్ మీద వచ్చిన ముగ్గురు దుండగులు అతడిని అడ్డగించి గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత పారిపోయారు. వెనకే మరో బైక్ మీద వస్తున్న ఉమేష్ భార్య,   ఉమేష్ కొడుకులు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు. వీరి ఈ మేరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి..  అబ్దుల్ తౌఫీక్, షోయబ్ ఖాన్, అతీఖ్ రషీద్ అనే ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

Udaipur Murder Case: "హిందూ స‌మాజం ఇలాంటి దారుణాల‌ను స‌హించ‌దు": శ్రీరామసేన

ఒకవేళ ఆ హత్య దొంగతనంలో భాగంగా చేసిందే అయితే.. ఉమేష్ వెంట ఉన్న డబ్బును వారు దోచుకువెళ్లేవారు. కానీ ఆయనను ఎందుకు హత్య చేసి ఉంటారనే విషయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.  అంతేకాదు కోల్హే తన సోషల్ మీడియాలో వివాదాస్పద నూపుర్  శర్మ కు అనుకూలంగా కొన్ని పోస్టులు షేర్ చేశాడు. వాటిని వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంచుకున్నాడని.. బీజేపీ అధికార ప్రతినిధి శివరాయ్ కులకర్ణి.. అమరావతి కమిషనర్ ఆర్తి సింగ్ ను కలిసి పలు అనుమాలు వ్యక్తం చేశారు. ఈ లోపే ఉదయ్ పూర్ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీని మీద దర్యాప్తు చేయిస్తున్నారు. 

కాగా, జూన్ 28న ఇద్దరు దుండగులు టైలర్ దుకాణంలోకి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కొలతలు తీసుకుంటున్న టైలర్ ను గొంతు కోసి చంపేశారు. బట్టలు కుట్టించుకుంటామనే నెపంతో హంతకులు అతని దుకాణానికి వచ్చారు. ఆ తరువాత హత్య చేశారు. అంతే కాదు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు వైరల్ చేశారు. ఇలా చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios