గుజరాత్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ట్రక్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గుజరాత్ : గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయి.. రెండేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అయితే, చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కీచకుడు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడైన 25 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్ లో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సూరత్ కు చెందిన శోభదీప్ బాల్కిసన్ (25) ట్రక్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకుడు అనువ్రత్ ద్వారా ఫ్లైఓవర్ కింద ఉన్న స్లమ్ ఏరియాలో ముక్కుపచ్చలారని ఓ రెండేళ్ల పసికందును అపహరించాడు. ఇదే విషయం మీద సోమవారం రాత్రి బాధితులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేశారు. చిన్నారిని గుర్తు తెలియని ట్రక్ డ్రైవర్ అపహరించుకుపోయారంటూ కంప్లైంట్ ఇచ్చారు,
వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. కంప్లైంట్ కాల్ వచ్చిన ప్రాంతం సహా అన్ని ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి ఓ పీసీఆర్ వ్యాన్ ఆ అగంతకుడిని కనిపెట్టింది. GJ-05-BT-4300 నెంబరు గల ట్రక్కులో చిన్నారిని అపహరించి తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు ఆ ట్రక్కుని ఆపి చెక్ చేయగా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. చిన్నారి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉంది.
ఆ చట్టాలతో పౌరసత్వ సవరణ చట్టాన్ని అనుసంధానం చేయాలి.. కేంద్రానికి అసదుద్దీన్ ఒవైసీ సలహా..
వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై పోక్సో, ఐసిపి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నీచులను కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ రాజధాని పరీవాహక ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. హర్యానాలోని గురుగ్రామ్ లో పదో తరగతి చదువుతున్న బాలికపై శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు హోటల్ లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు బాలిక స్నేహితులే ఉండటం గమనార్హం. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్నాలుగేళ్ల తన కుమార్తె శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిందని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు.
ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ కు వాకింగ్ కు వెళ్లి ఉంటుందని మొదట భావించానని.. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురై వెతకగా.. కనిపించలేదని ఆమె పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 10గంటల సమయంలో ఇంటి సమీపంలో తన కుమార్తెను గుర్తించినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపారు. రాత్రంతా ఎక్కడికి వెళ్లావు అని అడగగా.. తన స్నేహితుడు ఇద్దరూ బైక్ పై బయటకు ఎక్కించుకుని హోటల్ కి తీసుకుపోయారని.. వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తన తల్లికి తెలిపింది.
ఎక్కడైనా ఈ విషయం చెబితే చంపేస్తామని కూడా బెదిరించారని వాపోయింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలికి సివిల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై డీసీపీ దీపక్ సహారా మాట్లాడుతూ సోమవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కేసులో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
