Asianet News TeluguAsianet News Telugu

ఆర్బీఐ కీలక నిర్ణయం: రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేత

రూ.2 వేల రూపాయాల నోటు ముద్రణను  నిలిపివేస్తూ ఆర్భీఐ గురువారం నాడు నిర్ణయం తీసుకొంది. 

Two years after its launch, India stops printing new Rs 2,000 notes: Report
Author
Mumbai, First Published Jan 3, 2019, 5:17 PM IST


న్యూఢిల్లీ: రూ.2 వేల రూపాయాల నోటు ముద్రణను  నిలిపివేస్తూ ఆర్భీఐ గురువారం నాడు నిర్ణయం తీసుకొంది. మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు వీలుగా రెండువేల రూపాయాల నోటు ముద్రణను నిలిపివేశారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2016 నవంబర్ మాసంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత  రెండు వేల రూపాయాల నోటును  అమల్లోకి తీసుకు వచ్చారు.  రెండువేల రూపాయాల నోటు ముద్రణను నిలిపివేసినా కూడ ఈ నోట్ల చలామణి ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయాల నోటును ఆర్బీఐ చలామణిలోకి తీసుకువచ్చింది.

2018 మార్చి నాటికి 18.03 ట్రిలియన్ల రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.6.78 ట్రిలియన్లుగా ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.7.73 ట్రిలియన్ల రూ.500 నోట్లు ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్నాయి.

మరో వైపు రెండు వేల రూపాయాల నోటును రద్దు చేస్తారనే ఊహగానాలు వెలువడుతున్న తరుణంలో ఈ నోట్ల ముద్రణ చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేయడం కూడ రాజకీయంగా బీజేపీ ఎత్తుగడగా  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios