పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని స్టీల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. దొర‌హ ప‌ట్ట‌ణంలో రాంపూర్ రోడ్డుకు ఉన్న గ్రేట్ ఇండియా స్టీల్ కంపెనీలో మంగళం ఉదయం బాయిలర్ పేలుడు సంభవించింది, ఇద్దరు వ్యక్తులు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

పంజాబ్‌లోని లూథియానా జిల్లా దోరహా పట్టణంలోని స్టీల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని బాయిలర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసు అధికారి తెలియజేశారు. క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీలోని బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు కూలీలను సిద్ధూ ఆసుపత్రికి తరలించామని, అక్కడ వారు చనిపోయినట్లు ప్రకటించారని, మరికొందరు అక్కడ చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై డీఎస్పీ హర్‌సిమ్రత్ సింగ్ మాట్లాడుతూ.. కర్మాగారంలోని గ్యాసిఫికేషన్ యూనిట్ బాయిలర్‌లో మంగళవారం ఉదయం పేలుడు సంభవించిందని, అందులో ఆరుగురు కార్మికులు ఉన్నారని, వారిలో ఇద్దరు వినయ్ సింగ్, రాహుల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారని, మృతి చెందిన ఇద్దరూ బాయిలర్ సమీపంలో నిలబడి ఉన్నారని తెలిపారు.

ఆ సమయంలో వినయ్ బాయిలర్‌లో చెక్క దుంగలను లోడ్ చేస్తున్నాడు, రాహుల్ మెయింటెనెన్స్ డ్యూటీలో ఉన్నాడు. వారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించారని తెలిపారు.ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంలో ఆ యూనిట్ అధికారుల నిర్ల‌క్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.