తమిళ హీరో సూర్య నటించిన వీడొక్కడే సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో స్మగ్లింగ్ సీన్లు కూడా ఉంటాయి. అందులో ఓ వ్యక్తి పొట్టల్లో డ్రగ్స్ పెట్టుకొని విమానంలో ప్రయాణిస్తాడు. అచ్చం అలాంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. ఇక్కడ మాత్రం డ్రగ్స్ కి బదులు బంగారం. మిగితా అంతా సేమ్ టూ సేమ్.

పూర్తి వివరాల్లోకి వెళితే... కడుపులో 3 కిలోల బంగారుముద్దల్ని పె ట్టుకుని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళల్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. 10 మంది దుండగులు దారిలో ఆ ఇద్దరు మహిళలనూ కిడ్నాప్‌ చేశారు.

 వారికి ఎనిమా చేయించి కడుపులోని బంగారం బయటకు తీశారు. అనంతరం ఆ బంగారం వారు తీసుకొని ఇద్దరు మహిళలను వదిలేశారు. . చెన్నై పల్లావరం రహదారిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. మంగళవారం శ్రీలంక నుం చి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. 

వీరిలో ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. అయితే... ఆ  ఇద్దరు స్త్రీలు.. ఫాతిమా(32), త్రిష(36)ల తీరు అనుమానాస్పదంగా కనిపించింది. వారి కడుపులో ఉన్నది బిడ్డకాదేమో అనే అనుమానంతో పరీక్షించగా... బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తదించారు.  వారిద్దరి కడుపులో బంగా రపు ముద్దలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఎనిమా ద్వారా బయటకు తీయించేందుకు ఆస్పత్రికి కారులో బయల్దేరారు.
 
దారిలో 10 మంది దుండ గులు మహిళలను కిడ్నాప్‌ చేసి చెంగల్పట్టులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఎని మా చేయించి కడుపులో ఉన్న బంగారాన్ని తీసుకున్నారు. అనంతరం ఆ మహిళలను మీనంబాక్కం సమీపంలో విడిచిపెట్టగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి కిడ్నాప్‌ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. 

అలాగే.. చెన్నై విమానాశ్రయానికి మంగళవారం రాత్రి దుబాయి నుంచి వచ్చిన విమానంలో టాయిలెట్‌ వెనుక దాచి న 5.6 కిలోల 48 బంగారు కడ్డీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 5.6 కిలోల బరువైన ఆ బంగారం విలువ రూ.2.24 కోట్లు. మరో కేసులో రూ.11 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.